వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వామీ యే శరణం అయ్యప్పా: శబరిమలలో శ్రీశాంత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreesanth
శబరిమల: స్పాట్ ఫిక్సింగ్ నుంచి బయటపడేయాలని దేవదేవతలను ప్రార్థించడంలో భారత పేసర్ శ్రీశాంత్ నిమగ్నమయ్యాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి బెయిల్ మీద విడుదలైన అతను గుడులూ గోపురాలు తిరుగుతున్నాడు. తాజాగా, అతను శనివారం శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించారు.

తాను ఏ తప్పూ చేయలేదని శ్రీశాంత్ ఈ సందర్భంగా చెప్పాడు. గతంలో చిన్నపాటి లోపాలు తన వైపు జరిగి ఉండవచ్చునన, తాజా కేసులో మాత్రం తాను నిర్దోషినని అన్నాడు. తాను నిర్దోషిగా బయటపడుతాననే నమ్మకం ఉందని అతను దీమా వ్యక్తం చేశాడు. శబరిమలలో ప్రార్థనలు చేసిన తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు.

అయ్యప్ప స్వామి ఆశీస్సులతో తాను నిర్దోషిగా బయటకు వస్తానని, ఇక కొత్త శ్రీశాంత్‌ను చూస్తారని అన్నాడు. శ్రీశాంత్ వెంట తండ్రి శాంతకుమారన్ నాయర్, ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం అతను శబరిమల వచ్చాడు. అతను ఐదు కిలోమీటర్ల నడిచి ఆలయానికి చేరుకున్నాడు.

శ్రీశాంత్ శుక్రవారం అరటిపండ్లతో తులాభారం తూగాడు. శ్రీపూర్ణత్రయీశ వైష్ణవ ఆలయంలో ఈ మొక్కు తీర్చుకున్న విషయం తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్, అంకిత్ చవాన్‌ జూన్ 11వ తేదీన బెయిల్‌పై విడుదలయ్యారు. వీరితో పాటు రాజస్థాన్ రాయల్స్ మరో క్రికెటర్ అజిత్ చండిల కూడా అరెస్టయ్యాడు.

English summary
Out-on-bail Indian pacer S Sreesanth sought divine intervention in his efforts to emerge clean from the IPL spot-fixing scandal as he paid obeisance at the Sabarimala Ayyappa temple, insisting that he has not done anything wrong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X