వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ జెడిగా బాధ్యతలు స్వీకరించిన అరుణాచలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Arunachalam
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తులు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనులు, ఎమ్మార్... తదితర కేసులు దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ ఇటీవల వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

శనివారం లక్ష్మీ నారాయణ స్థానంలో కొత్త జాయింట్ డైరెక్టర్ అరుణాచలం బాధ్యతలను స్వీకరించారు. డిప్యుటేషన్ కాలం ముగియడంతో లక్ష్మీ నారాయణ ఈ నెల 11న సొంత కేడర్ మహారాష్ట్రకు వెళ్లిపోయారు. దీంతో చెన్నై సిబిఐ జెడి అరుణాచలం రాష్ట్ర సిబిఐ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు తీసుకున్నారు.

ఆయన విదేశీ పర్యటనలో ఉండటంతో డిఐజి వెంకటేష్‌కు బాధ్యతలు అప్పగించి లక్ష్మీ నారాయణ వెళ్లిపోయారు. ఈ నెల 17న అరుణాచలం బాధ్యతలు స్వీకరిస్తారని ముందుగా వార్తలు వచ్చినా ఆయన శనివారమే హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయానికి వచ్చి విధుల్లో చేరారు.

అయితే మీడియాతో మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. జగన్ ఆస్తులు, గాలి గనుల దోపిడీలాంటి సంచలన కేసుల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తుచేసిన లక్ష్మీ నారాయణకు విశేష ప్రాచుర్యం లభించింది. కాగా, కొత్త జెడి అరుణాచలం రాష్ట్రంలో రాజకీయాలతో పెనవేసుకున్న కేసుల్లో ఆయన ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
Senior Official Arunachalam on Saturday took charge as tha dditional incharge JD of CBI in AP. Arunachalam, a 1993 batch officer, would continue in the post till the government appoints another officials on a permanent basis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X