వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్కులో ముగ్గురు భక్తురాళ్లతో దిగంబర బాబా హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karnataka
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ బాబా హంగామా చేశారు. బెంగళూరులోని బన్నేరుఘట్ట పార్కులో సూర్య ప్రకాశ్ స్వామి దిగంబరంగా సంచరిస్తూ కలకలం రేపాడు. ముగ్గురు మహిళా భక్తులతో వాహనంలో వచ్చిన అతను అందరు చూస్తుండగానే చకచకా దుస్తులు విప్పేశాడు.

కొద్దిసేపు ద్విచక్ర వాహనంపై కూర్చొని ఫోజులిచ్చాడు. భక్తులను కూర్చోబెట్టి నగ్నంగా పూజలు చేశాడు. ఊయల ఊగాడు, అక్కడే పూజలు చేసేందుకు స్వామి దిగంబరంగానే భక్తులతో కలిసి ప్రారంభించగా.. పోలీసులు ఆయనను హెచ్చరించారు. పరదా కట్టుకొని పూజలు చేసుకోవాలని సూచించారు.

బాబా దిగంబరంగా ఉండటంతో అక్కడున్న వారు ఇబ్బందులు పడ్డారు. మహిళా సంఘాలు బాబా తీరు పైన మండిపడ్డాయి. బాబా విషయం తెలిసి.. జనాలు, మీడియా వస్తుండటంతో అతను అక్కడి నుండి జారుకున్నారు. ఇతను ప్రకాశం జిల్లాకు చెందిన బాబాగా తెలుస్తోంది.

అతను గతంలో టీచర్‌గా పని చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తర్వాత బాబాగా ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమయ్యాడు. భక్తులు ఇచ్చిన విరాళాలలో ఆశ్రమం నిర్మించాడు. 1982లో మౌన వ్రతం చేపట్టిన ఈ బాబా.. 1994 నుండి వస్త్ర సన్యాసం చేసి కనిపిస్తున్నారు.

English summary
Prakasham district Digambara Baba created hulchul in Bangalore Bannerughatta park on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X