వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదంలో మరో మంత్రి: మహీధర్‌కు హైకోర్టు నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahidhar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇప్పటికే ముగ్గురు మంత్రులు రాజీనామా చేయగా, మరో ముగ్గురు మంత్రులు కళంకితులుగా ముద్రపడ్డారు. ఇదే సమయంలో మరో మంత్రి వివాదంలో చిక్కుకున్నారు.

మంత్రి మహీధర్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మదనపల్లి శాసన సభ్యుడు షాజహాన్ భాషాకు కూడా నోటీసులు పంపించింది. రెండు వారోల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.

మదనపల్లి మున్సిపల్ చైర్మన్ శకుంతల దేవిపై వచ్చిన ఆరోపణలపై ఫిర్యాదు చేసినా మంత్రి, ఎమ్మెల్యే పట్టించుకోలేదని, ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చినా, నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదని రమణ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే, మంత్రి ఆస్తులపై ఎసిబి, సిబిఐలతో విచారణ జరిపించాలని అతను తన పిటిషన్‌లో కోరారు.

బయ్యారం గనులపై పిల్

విశాఖ ఉక్కుకు బయ్యారం గనుల కేటాయింపు పైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాఖ ఉక్కుకు బయ్యారం గనుల కేటాయింపును రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

English summary
High Court of Andhra Pradesh issued notices to Minister Mahidhar Reddy and Madanapalli MLA Shazahan Basha on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X