వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోపిదేవికి ఛాతినొప్పి, ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. మోపిదేవి గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ గత ఏడాదిలో జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన వాన్‌పిక్ అంశంలో అరెస్టయ్యారు.

మరోవైపు జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులలో నిందితులు ధర్మాన ప్రసాద రావు, కోనేరు మధు, కోనేరు ప్రసాద్, విజయ రాఘవ, బిపి ఆచార్య, శ్యామ్యూల్ తదితరులు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు.

విజయ సాయి పిటిషన్

విజయ సాయి, జగన్‌లను ఒకే జైలులో ఉంచవద్దని సిబిఐ పిటిషన్ పైన విజయ సాయి రెడ్డి ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను ఈ నెల 19న కోర్టుకు హాజరయ్యేలా జైలు అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. సిబిఐ మెమోపై కౌంటర్ వాదనలు వినేందుకు తనకు అనుమతివ్వాలని మెమో దాఖలు చేసారు.

English summary
Former Minister and Congress senior MLA Mopidevi Venkataramana surrering with health problem. He was sent to Osmania Hospital from Chanchalguda jail on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X