వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్ మంత్రివర్గ విస్తరణ: కొత్త మంత్రులు వీళ్లే

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం సాయంత్రం తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించారు. కొత్తగా ఎనిమిది మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తద్వారా కొత్తవారికి మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ అవకాశం కల్పించారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారి వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

కొత్త మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గిరిజా వ్యాస్‌కు కేబినెట్ హోదా లభించగా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సంతోష్ చౌదరి సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంతోష్ చౌదరి మూడు హోషియార్ పూర్ నుంచి సార్లు లోకసభకు ఎన్నికయ్యారు.

Manmohan Singh cabinet rershuffled

కేబినెట్ మంత్రులుగా

1. శిష్ రాం ఓలా - ఉపాధి, కార్మిక శాఖ
2. ఆస్కార్ ఫెర్నాండెజ్ (కర్ణాటక) - రోడ్లు, జాతీయ రహదారుల శాఖ
3. గిరిజా వ్యాస్ - గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖలు
4. కావూరి సాంబశివ రావు (ఏలూరు, ఆంధ్రప్రదేశ్) - జౌళి శాఖ

సహాయ మంత్రులు

1. మాణిక్ రావు గవిట్ - సామాజిక న్యాయం, సాధికారిత
2. సంతోష్ చౌదరి (హోషియార్‌పూర్, హిమాచల్ ప్రదేశ్) - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
3. డాక్టర్ ఇఎంఎస్ నాచియప్పన్ (శివగంగ, తమిళనాడు) - వాణిజ్యం, పరిశ్రమల శాఖ
4. జెడి శీలం (రాజ్యసభ, ఆంధ్రప్రదేశ్) - ఆర్థిక శాఖ

మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, చిదంబరం తదితర కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మన్మోహన్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త మంత్రుల చేరికతో మన్మోహన్ సింగ్ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 75కి చేరుకుంది.

English summary
PM Manmohan singh cabinet has been reshuffled today. AICC president Sonia Gandhi present at the oath taking ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X