వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు మంత్రి సిఆర్ చిచ్చు: శంకరన్న కూతురికి పదవి

By Pratap
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి వర్గానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య మరో చిచ్చు పెట్టారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిత్యం శివాలు ఊగుతున్న మాజీ మంత్రి పి. శంకరరావు కూతురు సుస్మితకు దేవాదాయ కమిటీ చైర్ పర్సన్‌గా నియమించడాన్ని రామచంద్రయ్య అనుమతించారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి వర్గంలో కలకలం ప్రారంభమైంది. దీనిపై కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సహా, కాంగ్రెసు శాసనసభ్యులు, కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆ కమిటీని రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ గొడవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెంతకు రానుంది. హైదరాబాదులో అత్యంత ప్రతి ష్ఠాత్మకమైన సికింద్రాబాద్ గణపతి ఆలయానికి చైర్ పర్సన్‌గా సుస్మిత నియమితులయ్యారు. శంకరరావు కూతురికి పదవి ఇవ్వడమంటే అసమ్మతి రామచంద్రయ్య ప్రోత్సహిస్తున్నారని భావించాల్సి ఉంటుందని అంటున్నారు.

శంకరరావు కూతురికి ఆలయ కమిటీ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు మాట మాత్రంగానైనా తనకు చెప్పకపోవడంపై కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సైతం తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ఈ వ్యవహారం సికింద్రాబాద్, సనత్‌నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. అసలు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోకి రాని ఆలయానికి ఆ నియోజకవర్గ నేతను ఎలా చైర్మన్‌ను చేస్తారని ఆ ఆలయ మాజీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత ఎన్. విఠల్ ప్రశ్నిస్తున్నారు.

దంపతులుగా పూజ చేయవలసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ఏ ప్రాతిపదికన ఆ పదవి శంకర్‌రావు కుమార్తెకు ఇచ్చారని వార్డు మెంబర్ జయప్రకాశ్, యూత్ కాం గ్రెస్ నేత రామకృష్ణ నిలదీశారు.

English summary
Union minister Chiranjeevi's camp minister C Ramachandraiah in a fresh controversy appointed CM Kiran kumar Reddy's rival P Shankar Rao's daughter Susmitha as temple committee chairperson.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X