వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణహాని: జగన్, భారతిలపై ముత్తయ్య ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Bharati and Ys Jagan
హైదరాబాద్: క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరించినందుకు తనను చంపుతామని బెదిరించిన బ్రదర్ అనిల్‌తో పాటు బినామీ కొండల్‌రావు, అనిల్ పీఏ కిరీటిల నుంచి తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర క్రైస్తవ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు జెరూసలెం మత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీ రాత్రి తనకు ఫోన్ చేసి బెదిరించారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తనకు వచ్చిన ఫోన్ నెంబర్ కూడా ఆయన ఇచ్చారు.

వైయస్ కుటుంబాన్ని బహిష్కరిస్తావా అంటూ ఆ ఫోన్‌లో బెదిరించారని తెలిపారు. తనను రాళ్లతో కొట్టి చంపండి అనేలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పత్రికలో వార్తను ప్రచురించారని, తనను చంపేందుకు ప్రేరేపించే కథనం వేసిన ఆ పత్రిక యాజమాన్యంతో పాటు వైయస్ భారతి, జగన్, పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డిలపై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్, డిజిపిలకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

ఈనెల 12వ తేదీన రవీంద్రభారతిలో జరిగిన క్రైస్తవ రాజకీయ చైతన్య సదస్సులో అభిప్రాయ సేకరణ, తీర్మానాలు క్రైస్తవ సమాజం అభిప్రాయాలను ప్రతిబింబించాయని చెప్పారు. ఓటింగ్ ద్వారా సేకరించిన అభిప్రాయం ప్రకారం వైయస్ కుటుంబాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం బహిష్కరించిందని, తీర్మానం పూర్తయ్యాక శ్రీనివాస్, స్వర్ణ, తాను కలిసి వివరాలు వెల్లడించామని చెప్పారు. క్రైస్తవుల సభలో పాల్గొంటే హిందువుల ఓట్లు పోతాయని భయపడే వారికి క్రైస్తవ కుటుంబంగా చెప్పుకునే హక్కు లేదని చెప్పారు. వైయస్ కుటుంబ గూండాలకు భయపడి, డబ్బు ప్రలోభాలకు లొంగి సదస్సు తీర్మానాన్ని వక్రీకరిస్తూ స్వర్ణ ప్రకటించారన్నారు.

బైబిల్ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బహిష్కరించాలని ప్రజలను కోరారు. జెరూసలెం మత్తయ్యకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని తెలంగాణ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ (టీఐబీసీ) అధ్యక్షుడు డాక్టర్ స్వామిదాసు డిమాండ్ చేశారు.

English summary
Federation of christian associations president Jerusalem Muttaiah complained against YSR Congress party president YS Jagan and his wife YS Bharati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X