వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్షం: ఉత్తరాఖండ్ బీభత్సం, ముంబై అహ్లాదం (చిత్రాలు)

By Srinivas
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్/హైదరాబాద్: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా వరదలు వచ్చాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్‌లో వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా 60 మంది మృతి చెందగా, 70వేలకు పైగా భక్తులు వరదలు, కొండ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఇందులో తెలుగు వారు దాదాపు రెండు వేల నుండి మూడు వేల వరకు ఉన్నారు.

వరదల్లో చిక్కుకున్న భక్తులను, ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్లు, సైన్యం రంగంలోకి దిగింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. గంగా, యమునా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. గంగోత్రి, యమునోత్రి వద్ద దాదాపు యాభై వేల మంది యాత్రికులు చిక్కుకున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. వరద బీభత్సానికి 80 కిలోమీటర్ల మర రహదారి కొట్టుకుపోయింది.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించి క్షేమంగా స్వస్థలాలకు పంపాలని లేఖలో కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు.

వరదల్లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కూడా చిక్కుకున్నారు. ఈ నెల 23న మండీ లోకసభ స్థానానికి జరిగే ఎన్నికలలో ప్రచారం కోసం ఆయన సింగ్లా లోయకు వెళ్లారు. ఈ ప్రాంతాన్ని భారీ వర్షాలు, హిమపాతం ముంచెత్తడంతో ఆయన సహా పలువురు అక్కడ చిక్కుకున్నారు. ఆయనను అధికారులు మంగళవారం రక్షించారు.

వరదలో శివుడు

ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. చార్ ధామ్ యాత్రకు వెళ్లిన వేలాది భక్తులు చిక్కుకుపోయారు. గంగా నది ఉప్పొంగడంతో వరదలో మునిగిన శివుడు.

భక్తుల కష్టాలు

భారీ వర్షాల కారణంగా గంగా, యమునా తదితర నదులు పొంగి పొర్లుతుండటంతో భక్తులు, ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు.

వాహనాలక తంటాలు

భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమలమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురైనా పలువురు రోడ్లపైకి వస్తున్నారు.

వరద నీటిలో వాహనాలు

వరదలలో చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు.. ఇలా అన్ని రకాల వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.

గొడుగు రక్షణనిచ్చేనా?

నాలుగు రోజులుగు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వర్షంలోనే బయటకు వచ్చిన ప్రజలు. గొడుగులతో వారు బయటకు వచ్చారు.

కుంగిన రోడ్లు

భారీ వరదలతో పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పలుచోట్ల కుంగిపోయాయి. హరిద్వార - మనా రహదారిలో కొట్టుకుపోయిన రహదారిలో కారు పడింది. దీంతో దానిని చూసేందుకు అక్కడ ప్రజలు గుమికూడారు.

భగీరథికి కోపమొచ్చింది!

ఉత్తరాఖండ్‌లోని ప్రేమ్ నగర్‌లో భగీరథి నది తీరాన గల మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనం ఆదివారం కూలిపోయింది.

వరదల్లో ఢిల్లీ విమానాశ్రయం

వరదల కారణంగా ఢిల్లీ విమానాశ్రయం తడిసిముద్దయింది. విమానాశ్రయంలోకి నీరు వచ్చింది. దీంతో సిబ్బంది నీటిని తొలగిస్తున్న దృశ్యం.

ఢిల్లీలో అద్భుత దృశ్యం

ఢిల్లీలోను వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఢిల్లీలో స్వల్పంగా వర్షం కురిసింది. దీంతో రాజ్‌పత్ రోడ్డులో చిరు వర్షంలో నగర ప్రజలు.

వర్షంలో ఆనందం

ముంబయిలో కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ఓ తండ్రి తన పిల్లలను రోడ్డు పైనే నిలిచిన నీటిలో తీసుకు వెళ్తున్న దృశ్యం.

పిల్లల కేరింతలు

ఉత్తరాదిన కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాంతాలు జలమయం కావడంతో చిన్నారులు నీటిలో ఆడుకుంటున్న దృశ్యం.

తాజ్ మహల్ వద్ద..

భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ.. వర్షంలోనే భారీగా పర్యాటకులు తాజ్ మహల్‌ను చూసేందుకు వచ్చారు. గొడుగులు పట్టుకొని మరీ తాజ్ అందాన్ని వీక్షిస్తున్న పర్యాటకులు.

ముంబైలో యథాతథం

వర్షాల కారణంగా రోడ్లు జలమయమైనప్పటికీ విధులకు వెళ్లే వారు కష్టమైనా ఇంటికి పరిమితం కాలేదు. ముంబైలో రోడ్లపై వాహనాల దృశ్యం.

చిరు వర్షంతో దూసుకొస్తున్న రైలు

ముంబైలో వర్షంలో ఓ రైలు దూసుకొస్తున్న దృశ్యం. ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తోంది.

ఉత్తరాఖండ్‌లో ఉగ్రరూపం

నాలుగైదు రోజులుగా ఉత్తరాఖండ్ ప్రజలు, హరిద్వార్, ఉత్తర కాశీ యాత్రలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్రాంతంలో భక్తుల కష్టాల దృశ్యం.

ఉత్తరాఖండ్

అందమైన, అహ్లాదమైన ఉత్తరాఖండ్ భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలం అయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలువురు మృతి చెందారు. దైవదర్శనం కోసం వెళ్లిన భక్తులు వరదల్లో చిక్కుకుపోయారు.

English summary
While some states rejoice the early arrival of monsoon in the country, the situation is tad different in the northern region, especially Uttarakhand and Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X