వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి ప్రశంస: నితీష్ కుమార్‌కు వీడియో చిక్కులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Nitish Kumar
పాట్నా: ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న జెడి(యు)పై బీహార్ భారతీయ జనతా పార్టీ వీడియోలతో యుద్దానికి సిద్ధమైంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బిజెపి ప్రచార కమిటీ సారథిగా నియమించడంపై అలక వహించిన జెడియు నేతలు నితీష్ కుమార్, శరద్ యాదవ్‌లు రెండు రోజుల క్రితం ఎన్డీయేకు రాం రాం చెప్పారు. మోడీ వల్లనే తాము బయటకు వెళ్లిపోతున్నామంటూ ప్రకటించారు.

మోడీ కారణంగా బయటకు వెళ్లిన నితీష్ పైన ఆయన పాత వీడియోలను విడుదల చేసి బీహార్ బిజెపి ఎదురుదాడికి సిద్ధపడింది. గతంలో నితీష్... మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. గోద్రా అల్లర్ల అనంతరం 2003లో నితీష్ ఓ సందర్భంలో మాట్లాడుతూ... మోడీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారన్నారు. గోద్రా అల్లర్లు బాధాకరమని చెబుతూనే.. మోడీని పొగిడారు. మోడీని అప్పట్లో నితీష్ పొగిడిన వీడియోలను బిజెపి బయట పెట్టి ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.

లౌకికవాదిని: నితీష్

తాను ఎప్పటికీ లౌకికవాదినేనని బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అగ్రనేత నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం చెప్పారు. తాను లౌకికవాదినని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పడం సంతోషకరమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

ఎన్డీయేతో జెడి(యు) తెగతెంపులు చేసుకోవడంలో ఎలాంటి దురుద్దేశ్యం లేదని చెప్పారు. దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నితీష్ కుమార్ చెప్పారు.

అద్వానీని కలిసిన మోడీ

నరేంద్ర మోడీ అగ్రనేత అద్వానీని మంగళవారం కలుసుకున్నారు. బిజెపి ప్రచార కమిటీ సారథిగా ఎంపికైన మొదటిసారి ఆయన అద్వానీని కలిశారు.

English summary
Bitter over JD(U) snapping its 17 year old alliance, the BJP on Monday decided to expose duplicity of CM Nitish Kumar over Narenda Modi by pulicly releasing CDs of his speeches in which he consistently praised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X