హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంకరన్నకు కొత్త కష్టం: వేధింపులని కోడలు ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావుకు కొత్త చిక్కులు వచ్చాయి. ఇప్పటి వరకు బయటి నుండి ఇబ్బందులు ఎదుర్కొన్న శంకర రావు తాజాగా కుటుంబ సభ్యుల నుండే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన కోడలు వంశీప్రియ మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

తన భర్త శశాంక్, మామ శంకర రావు, అత్త విశ్వశాంతి, ఆడపడుచు సుష్మితను అరెస్టు చేయాలని ఆమె అందులో కోరారు. వారు తమను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులచే విచారణ జరిపించాలని కోరారు. తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆమె అన్నారు.

అంతకుముందు క్రిమినల్ కోర్టు వారిని కోర్టు ఎదుట లొంగిపోవాలని, పాస్‌పోర్టులు పోలీసులకు ఇవ్వాలని ఆదేశించిందని కానీ, వారు సరెండర్ కాలేదని, వారిపై పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

వంశీప్రియ చేసిన ఫిర్యాదు మేరకు... శంకర రావు కూతురు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతనే తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె పేర్కొన్నారు. తనను వేధిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

English summary
Former minister and Secunderabad Cantonment legislator P ShankarRao's daughter-in-law VamsiPriya on Tuesday approached the AP High Court with a writ petition seeking the arrest of her her husband Shashank, father-in-law ShankarRao, mother-in-law VishwaShanti and sister-in-law Sushmita.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X