వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడి దయవల్లే బయటపడ్డారు: హర్భజన్ సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harbhajan Singh
డెహ్రాడూన్: వరద బాధితులకు ఇండో టిబెట్ బోర్డర్ ఫో ర్స్ (ఐటీబీపీ) సహాయక చర్యలను భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ కొనియాడాడు. ఇక్కడ భారీ వర్షాలతో చార్‌ధామ్ తీర్థ యాత్రికులు వేలాది మంది వరదల్లో చిక్కుకు పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భజ్జీ కూడా ఐటీబీపీ క్యాంప్‌లో తలదాచుకుంటున్నాడు.

ఐటీబీపీ క్యాంప్‌లో ఉండడం తన అదృష్టమని, ఈ జవాన్లు చాలా మందిని కాపాడుతున్నారని ఆయన చెప్పాడు. ఐటీబీపీ చాలా గొప్ప పని చే స్తోందని భజ్జీ తెలిపాడు. తాను హేమ్‌కుంత్ షాహిబ్ మందిరం దర్శనానికి వచ్చానన్నాడు. అయితే మళ్లీ తప్పకుండా ఇక్కడి వస్తానని చెప్పాడు.

యాత్రికులు తాము ఇక్కడ చిక్కుకు పోయామని భావిస్తున్నారని, అయితే వారు దేవుడి దయవల్లే ప్రాణాలతో ఉన్నారని అన్నాడు. ఉత్తర భారతాన్ని వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటిక వరకు 131 మంది మరమించారు. 73 వేల మందికిపైగా యాత్రికులు వేర్వేరు చోట్ల చిక్కుకుపోయారు.

కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యుమునోత్రిలను సందర్శించడానికి యాత్రికులు వచ్చారు. వారంతా ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్‌లో వర్షాల వల్ల 102 మంది మరణించారు.

English summary

 Team India cricketer Harbhajan Singh said that due to God's grace the tourists are still alive, who stranded in CHardham. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X