వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ బీభత్సం: ఐదుగురు విశాఖవాసుల మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Uttarakhand floods
విశాఖపట్నం/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విశాఖపట్నంకు చెందిన ఐదుగురు మృతి చెందారు. ఉత్తరాదిన భారీ వర్షాలు కురవడంతో గంగా, యమనా తదితర నదులు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్తరాఖండ్‌లో డెబ్బై వేల మందికి పైగా వరదల్లో చిక్కుకుపోయారు. అందులో మన తెలుగువారు దాదాపు మూడువేల మంది ఉన్నారు.

విశాఖకు చెందిన ఐదుగురు ఉత్తర కాశీలో మృతి చెందినట్లు ఉత్తరాఖండ్ అధికారులు సమాచారం అందించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వరదల్లో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంకు చెందిన వీరభద్రప్ప మృతి చెందిన విషయం తెలిసిందే.

ఉత్తర కాశీ, చార్ ధామ్ యాత్రకు వెళ్లిన అక్కడే చిక్కుకుపోయిన యాత్రికులలో హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన 25 మంది ఉన్నారు. కొండచరియలు విరిగిపడ్డాయని, అక్కడి పరిస్థితులపై వస్తున్న వార్తలతో ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఎలాగైన ప్రభుత్వం స్పందించి ఉత్తర కాశీ యాత్రకు వెళ్లిన నగరవాసులను రక్షించాలని కోరుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 25 మంది ఉన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరి గ్రామానికి చెందిన 18 మంది యాత్రికులు గంగోత్రిలో చిక్కుకుపోయారు.

English summary
Five Vishakapatnam district devotess dead in Uttarakhan floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X