• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్యాకేజ్ అవివేకం: వెంకయ్య, తెరాసదే కీలక పాత్ర: కెకె

By Srinivas
|

venkaiah naidu and k keshav rao
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటుంటే, కేంద్రం తెలంగాణకు ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం సరికాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా వరదలో చిక్కుకుపోయి, న్యూఢిల్లీలోని ఎపి భవన్‌కు తరలించిన వారిని వెంకయ్య ఈ రోజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఉత్తర భారతంలోని భారీ వరదల కారణంగా జరిగిన నష్టానికి ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. అధికార కాంగ్రెసు పార్టీ మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకొని, తమపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. బిజెపి మతతత్వ పార్టీ అని చెప్పడం విడ్డూరమన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెసు లౌకికవాదం జపం చేస్తోందని మండిపడ్డారు. మూడో ఫ్రంట్‌ను ప్రజలు నమ్మరన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వైపు అందరూ చూస్తున్నారన్నారు. మోడీ ప్రధాని కావాలని సర్వేలన్నీ చెబుతున్నాయన్నారు. కాగా అంతకుముందు పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ భేటీ అయ్యారు. మోడీకి వ్యక్తిగతంగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పట్లనే తాను అసంతృప్తి చెందానని, అందరు సమష్టిగా పని చేస్తే ఇబ్బందులు ఉండయని అద్వానీ అన్నట్లుగా సమాచారం.

మున్ముందు తెరాస కీలక పాత్ర: కెకె

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె కేశవ రావు అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెరాస భూమిక ప్రభుత్వంలో ఎంతో ఉంటుందన్నారు. జాతీయ రాజకీయాల్లోను తమ ముద్ర ఉంటుందన్నారు. గవర్నర్ నరసింహన్ తీరు సరిగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వనంటే కాంగ్రెసు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bharatiya Janata Party senior leader Venkaiah Naidu said on Thursday that Telangana people are seeking separate state but not package.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more