వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిక్సింగ్: బుకీల నుంచి డబ్బులు తీసుకున్న త్రివేది

By Pratap
|
Google Oneindia TeluguNews

Siddharth Trivedi
న్యూఢిల్లీ: బుకీల నుంచి తాను డబ్బులు తీసుకున్నట్లు, అయితే తిరిగి ఇచ్చే ఉద్దేశంతోనే వాటిని తీసుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ సిద్ధార్థ త్రివేది చెప్పాడు. ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో త్రివేది ప్రాసిక్యూషన్ సాక్షిగా మారిన విషయం తెలిసిందే.

బుకీలు దీపక్ శర్మ, సునీల్ భాటియాల నుంచి తాను 2012లో 3 లక్షల రూపాయలు తీసుకున్నానని, స్టింజ్ ఆపరేషన్‌లో పలువురు దేశివాళీ క్రికెటర్లు పట్టుబడిన నేపథ్యంలో వాటిని తిరిగి ఇచ్చేసినట్లు త్రివేది చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ అరెస్టయ్యారు. ఈ కేసులో త్రివేది ప్రాసిక్యూషన్ సాక్షిగా మారాడు. మే 16వ తేదీన పోలీసులు ఆ ముగ్గురు ఆటగాళ్లను అరెస్టు చేశారు.

స్పాట్ ఫిక్సింగ్ కేసులో పోలీసులు మొత్తం 26 మందిని అరెస్టు చేశారు. వారిలో కొంత మంది మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. అజిత్ చండిల మినహా మిగతావారందరూ బెయిల్‌పై విడుదలయ్యారు.

English summary
According to media reports - Rajasthan Royals pace bowler Siddharth Trivedi, who became a prosecution witness, has reportedly admitted to have taken money from the bookies only to return it back to them later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X