హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యశ్వంత్: మరణించి.. ఐదుగురికి ప్రాణ దానం చేశాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Five organs of youth donated
హైదరాబాద్: హెచ్ఎస్ యశ్వంత్ కుమార్ అనే పద్దెనిమిదేళ్ల యువకుడు అవయవదానం చేసి ఐదుగురిని బతికించాడు. యశ్వంత్ తండ్రి హెచ్ఎస్ శివకుమార్ తన తనయుడి అవయవాలను గురువారం ఇతరులకు ఇచ్చి, ప్రాణదానం చేశారు. యశ్వంత్ కుమార్ చదువుకుంటూనే కేటరింగ్ పని చేస్తున్నాడు.

అతను కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. జగద్గిరిగుట్టకు చెందిన యశ్వంత్ చందానగర్ సమీపంలో ఈ నెల 15వ తేదిన కేటరింగ్‌కు వెళ్లాడు. అక్కడి నుండి తిరిగి వస్తూ తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కాడు. మార్గమధ్యలో ఆటోలో నుండి జారిపడ్డాడు.

దీంతో అతని తలకు డివైడర్ తగిలి, తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని నిమ్స్‌లో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా బుధవారం పరిస్థితి విషమించింది. యశ్వంత్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. జీవన్‌దాన్ ప్రతినిధులు అతని కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పించారు.

దీంతో గురువారం పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురికి యశ్వంత్ మూత్రపిండాలు, కాలేయం, రెండు గుండె కవాటాలను అమర్చినట్లు జీవన్‌దాన ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.

English summary
Five organs of 18 year old H.S. Yashwanth Kumar were donated by his father Shiva Kumar to the organs donation wing of the Jeevandan on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X