వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనింతే: సంతకాల సేకరణపై లొంగేది లేదన్న మహీధర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahidhar Reddy
హైదరాబాద్: తాను ఎవరికీ లొంగనని, తాను ఇలాగే ఉంటానని మంత్రి మహీధర్ రెడ్డి శుక్రవారం చెప్పారు. తనకు వ్యతిరేకంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సంతకాలు సేకరిస్తున్నారనే అంశంపై ఆయన స్పందించారు. తాను ఇలాగే ఉంటానని అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని సంతకాలు పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.

వారి సొంత పనులు చేయలేదనే సంతకాల సేకరణ చేపట్టారన్నారు. దాంతో తనకు ఇబ్బంది లేదన్నారు. మరోవైపు ఆయనకు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అండగా నిలబడ్డారు. మహీధర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టడం సరికాదన్నారు.

పిఏసి చైర్మన్‌గా కృష్ణమూర్తి

పిఏసి చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తిని నియమిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభాపతికి శుక్రవారం లేఖ రాశారు. అమెరికాలో ఉన్న చంద్రబాబు లేఖను రాశారు.

పిఏసి చైర్మన్ విషయమై రేవూరి ప్రకాశ్ రెడ్డి, కెఈ కృష్ణమూర్తి మధ్య గతేడాది ఒప్పందం జరిగింది. ఏడాది రేవూరి, మరో ఏడాది కెఈకి అప్పగించేవిధంగా నిర్ణయించారు. చంద్రబాబు రాసిన లేఖను తెలుగుదేశం పార్టీ నేతలు సభాపతికి ఈ రోజు ఇవ్వనున్నారు.

English summary

 Minister Mahidhar Reddy has responded on Congress MLAs sign collection against him on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X