వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖేల్ ఖతమ్: అన్ని ఫార్మాట్లకూ పాంటింగ్ అల్విదా

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ క్రికెట్ క్రీడ ముగిసింది. అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి ఈ ఏడాది అక్టోబర్‌లో రికీ పాంటింగ్ తప్పుకోనున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున చాంపియన్స్ లీగ్ ట్వంటీ20 టోర్మమెంట్ అతనికి చివరిది కానుంది. 38 ఏళ్ల రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి గత వేసవిలోనే తప్పుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) ఆరో ఎడిషన్ విజేత ముంబై ఇండియన్స్ తరఫున ఆడే చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నమెంటులో చివరగా ఆడుతాడని రికీ పాంటింగ్ ప్రాతినిధ్యం వహించే మార్కెటింగ్ ఏజెన్సీ డైనమిక్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ గ్రూప్ ప్రకటించింది. దీన్ని బట్టి సొంత గడ్డపై ఇది వరకే అతను చివరి మ్యాచ్ ఆడాడని అర్థమవుతోంది.

Ricky Ponting

ఇంగ్లీష్ కౌంటీ టీమ్ సర్రీ, కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆంటిగ్వా జట్ల తరఫున అతను జులై, ఆగస్టు నెలల్లో ఆడుతాడు. అతను క్రికెట్ వ్యాఖ్యాతగా మారే అవకాశం ఉంది. చానెల్ 9, చానెల్ 10 కోసం అతను క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

తన చివరి టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికాపై రికీ పాంటింగ్ కేవలం 32 పరుగులు చేశాడు. ఐపియల్ టోర్నమెంటులో రికీ పాంటింగ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కొన్ని మ్యాచుల తర్వాత అతను తప్పుకుని రోహిత్ శర్మకు కెప్టెన్సీని అప్పగించాడు.

English summary
Former Australian captain and one of the greatest batsmen of modern age, Ricky Ponting, will retire from all forms of cricket in October, and the Champions League Twenty20 tournament with Mumbai Indians will be his last competitive outing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X