వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో సైంధవపాత్ర కెసిఆర్ ఫ్యామిలీదే: గోనె

By Pratap
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వాడుకుంటున్నారని, అందువల్లనే తెలంగాణవాదులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ శానససభ్యుడు గోనె ప్రకాశ రావు విమర్శించారు. తెలంగాణలోని మరణాలకు కెసిఆర్ బాధ్యత వహించాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శానససభలో తీర్మానం అవసరం లేదని తెరాస గతంలో చెప్పిందని, ఇప్పుడు తీర్మానం కావాలంటూ పట్టుబడుతూ శానససభను స్తంభింపజేసిందని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర ఏర్పాటుకు శానససభ తీర్మానం అవసరం లేదని కెసిఆర్ కూడా అన్నారని ఆయన గుర్తు చేశారు.

సమైక్యాంధ్ర సభ వ్యాఖ్యలకు స్పందిస్తూ శాసనసభలో తీర్మానం అవసరం లేదని తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, కెటి రామరావు కూడా అన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబానిదే సైంధవ పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గతంలో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు.

శాసనసభలో తీర్మానమంటూ తెరాస ఆడుతున్న డ్రామాను రుజువు చేస్తానని అన్నారు. దీనిపై ఎవరితోనైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిాపరు. తన ఆరోపణలు రుజువు చేస్తే దేశం విడిచి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని గోనె అన్నారు. దుమ్ముంటే తన సవాల్‌ను కెసిఆర్ కుటుంబ సభ్యులు స్వీకరించాలని ఆయన అన్నారు. కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్ వ్యాఖ్యలను ఆధారాలతో సహా బయటపెడుతానని అన్నారు.

English summary
Former MLA from Telangana region Gone Prakash Rao said that the Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao (KCR) should take responsibility for suicides in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X