వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో నిమ్మగడ్డను కలిసిన నటుడు జగపతిబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jagapathi Babu and Nimmagadda Prasad
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌ను సోమవారం ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు కలిశారు. వాన్‌పిక్ భూముల కేటాయింపు వ్యవహారంలో సిబిఐ నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో చంచల్‌గుడా జైలులోనే ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని కర్ణాటక శాసనసభ్యుడు వి. శ్రీరాములు కలిశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డిని ఆనయ కుటుంబ సభ్యులు కలిశారు.

నిమ్మగడ్డ ప్రసాద్‌ను చంచల్‌గుడా జైలులో సినీ ప్రముఖులు కలవడం కొత్తేమీ కాదు. గతంలో పలు మార్లు హీరో అక్కినేని నాగార్జున ఆయనను కలిశారు. ఆ మధ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆయనను కలిశారు. నిమ్మగడ్డ ప్రసాద్ తనకు మంచి మిత్రుడని, అందుకే తరుచుగా కలుస్తుంటానని నాగార్జున మీడియా ప్రతినిధులతో అప్పట్లో అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను నిరుడు మే 15వ తేదీ సాయంత్రం సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు విచారించిన అనంతరం సిబిఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ 12వ నిందితుడు. జగన్‌కు చెందిన వ్యాపార సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపు రూ. 504 కోట్లు పెట్టినట్లు సమాచారం.

English summary
Tollywood actor Jagapathi Babu met industrialist Nimmagadda Prasad alias Matrix Prasad, accused in YSR Congress party president YS Jagan case, in Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X