వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూసైడ్ నోట్ ఎఫెక్ట్: కెసిఆర్‌ను అరెస్ట్ చేయాలని టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన వెయ్యి ఆత్మబలిదానాలకు కెసిఆరే కారణమని ఆరోపించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దగ్గర ప్యాకేజీ మాట్లాడుకొని తెలంగాణవాదాన్ని అమ్మేశారన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వమే లేదన్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కెసిఆర్‌ను సంప్రదించాకే తెలంగాణకు ప్యాకేజీ అంటూ లీక్ చేసిందని పెద్దిరెడ్డి విమర్శించారు. ఆటో డ్రైవర్ లక్ష్మీ నారాయణ సూసైడ్ నోట్ చూస్తే తెలంగాణ ద్రోహులు ఎవరో అర్థమవుతోందన్నారు. ఆంధ్రా ప్రాంతానికి లక్ష కోట్ల ప్యాకేజీ ఇచ్చి రాష్ట్రాన్ని విభజించాలన్నారు. కెసిఆర్ తెలంగాణవాదాన్ని భాగ్యలక్ష్మి బంపర్ డ్రాగా చూస్తున్నారని విమర్శించారు. కాగా ఆటో డ్రైవర్ లక్ష్మీ నారాయణ ఆత్మహత్య నోట్‌లో కెసిఆర్ పేరును రాసినట్లుగా వార్తలు వచ్చాయి.

వైయస్‍పై సోమిరెడ్డి నిప్పులు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కెవిపి రామచంద్ర రావు బంధువు నాలుగేళ్లలో రూ.300 కోట్లు సంపాదించారని టిడిపి నేత సోమిరెడ్డ చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కృష్ణపట్నం భూఆక్రమణను జగన్ కేసులో భాగంగా సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సహజ వనరులను ఓ కుటుంబానికి ధారాదత్తం చేసేందుకు అధికారం వైయస్‌కు ఎవరిచ్చారన్నారు. కృష్ణపట్నం భూకేటాయింపులలో వైయస్ కుటుంబానికి సంబంధం ఉందన్నారు.

చంద్రబాబు లేఖ

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ బహుగుణకు, రైల్వే శాఖ మంత్రి ఖర్గేకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆయన ఈ రోజు డెహ్రాడూన్‌లో పర్యటించారు. అక్కడున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఖర్గే, బహుగుణలకు లేఖ రాశారు. గంగోత్రి హర్షిల్ వద్ద నాలుగు వందల మంది తెలుగు వారు ఉన్నారని, వారిని అదుకోవాలని లేఖలో కోరారు. అలాగే తెలుగు వారిని వారి స్వగ్రామాలకు పంపించేందుకు మానవ దృక్పథంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కోరారు.

English summary
Telugudesam Party senior leader Mothkupalli Narasimhulu has demanded TRS chief K Chandrasekhar Rao's arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X