రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెహ్రూపై ఫిర్యాదు చేస్తా: రవి, ప్రజల్లోనే: మురళీమోహన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devineni Nehru and Yalamancheli Ravi
విజయవాడ/రాజమండ్రి: కృష్ణా జిల్లా విజయవాడ రాజకీయం మరోసారి రసకంధాయంలో పడింది. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పాదయాత్రను శాసన సభ్యుడు యలమంచిలి రవి తప్పు పట్టారు. దేవినేని నెహ్రూ పాదయాత్రలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెహ్రూ పైన తాను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికలలో విజయవాడ తూర్పు టిక్కెట్ తనదే అన్నారు. తనకు కాంగ్రెసు పార్టీ ముఖ్యమని, నెహ్రూ మాత్రం టిడిపిలో ఉన్న సోదరుడితో కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నెహ్రూ అయోమయానికి గురి చేస్తున్నారన్నారు.

ఓడినా ప్రజల్లోనే: మురళీ మోహన్

తాను 2009 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ సోమవారం అన్నారు. సమాజంలో ప్రత్యక్షంగా సేవ చేయాలనే సదుద్దేశ్యంతోనే తాను రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. గత ఎన్నికలలో తాను ఓడినప్పటికీ ప్రజల మధ్యే ఉంటున్నట్లు చెప్పారు. నిత్యం రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్పారు. ఈ రోజు మురళీ మోహన్ రాజమండ్రిలో తన 74వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

English summary
Krishna distrcit Vijayawada MLA Yalamanchili Ravi criticised former Minister Devineni Nehru for his padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X