వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతికి మాజీ మంత్రి, కొడుకు లైంగిక వేధింపు: కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Ex-Kerala minister booked for harassment
కొచ్చి: కేరళలో ఓ మాజీ మంత్రి పైన లైంగిక వేధింపుల కేసు నమోదయింది. కేరళ ప్రతిపక్ష లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)కు చెందిన మాజీ మంత్రి పైన ఈ కేసు నమోదయింది. ఈ కూటమికి చెందిన మాజీ మంత్రి, శాసన సభ్యుడు జోస్ తెట్టాయిల్‌తో పాటు ఆయన తనయుడి పైనా కేసు నమోదయింది.

తెట్టాయిల్, ఆయన కుమారుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళలోని సౌర విద్యుత్తు పథకంలో జరిగిన కుంభకోణంపై ఎల్డీఎప్ గత కొన్ని రోజులుగా అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. అధికార పార్టీని నిలదీస్తోంది.

ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయిన జోస్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ప్రతిపక్షానికి మింగుడు పడకుండా తయారయంది. ఈ కేసును తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి చెబుతున్నారు.

తనపై ఫిర్యాదు చేసిన మహిళ తనకు తెలుసునని, తన కుమారుడికిచ్చి పెళ్లి చేయమని బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు. మరోవైపు ఫిర్యాదు చేసిన మహిళ, మాజీ మంత్రి, ఆయన కుమారుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తన వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని చెబుతోంది.

English summary
Former Minister was on Sunday booked by police in a sexual harassment case. The case was registered on the basis of a complaint filed by a woman who alleged that she had been sexually abused by former minister and his son, police sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X