వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరిలో ఎవరో?: ప్రధాని, సోనియాలపై మో'ఢీ' ఎద్దేవా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi
పంజాబ్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం జరిగిన పంజాబ్ - జమ్ము కాశ్మీర్ సరిహద్దులోని పఠాన్‌కోట్ పట్టణంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ 60వ వర్ధంతి సంర్భంగా జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. కాంగ్రెసుతో దేశ ప్రజలకు భవిష్యత్తు లేదన్నారు. మనం మన యువత భవితతో ఆటలాడుకోలేమన్నారు.

కాశ్మీర్ గాయాలను మాన్చాల్సిన అవసరముందన్నారు. యువకుల ఆకాంక్షలను ప్రధాన స్రవంతిలోకి, అక్కడి నుంచి దేశాభివృద్ధి కృషిలోకి మళ్లించాలంటూ యువనాదం చేశారు. పార్టీలను, హృదయాలను ఒక్కటి చేయడానికి పాటుపడతానని ప్రకటించారు. పదేపదే మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రస్తావన తీసుకొచ్చారు. గుజరాత్‌లో పిల్లల స్కూలు బ్యాగులపై వాజ్‌పేయి బొమ్మ వేయించిన ఆయన.. వాజ్‌పేయి అసంపూర్ణంగా వదిలిపెట్టిన కర్తవ్యాలను పరిపూర్తి చేసేందుకు బిజెపికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు.

కాశ్మీర్ విధానంతో పాటు ఆర్థిక, జాతీయ భద్రత తదితర విషయాల్లోనూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. వాజ్‌పేయికి 2004లో మరో అవకాశం ఇచ్చిఉంటే కాశ్మీర్ సమస్యను ప్రేమతో, చర్చల ద్వారా, అక్కడి ప్రజల హృదయాలను గెలుసుకోవడం ద్వారా పరిష్కరించి ఉండేవారని కొనియాడారు. రక్తాన్ని కళ్ల చూడటం తప్ప తుపాకులు ఏ ఒక్కరికీ జీవితాన్ని ఇవ్వలేవని తెగేసి చెప్పారు.

అభివృద్ధి క్రమంలో భాగస్వాములు కావాలని కాశ్మీరీ యువత కోరుకుంటున్నదని చెప్పారు. కాశ్మీర్ కోసం శ్యామ్ ప్రసాద్ బలిదానం చేశారని నివాళి అర్పించారు. ఒక వ్యవస్థలో ఇద్దరి పెత్తనం వద్దే వద్దు అని ముఖర్జీ అనేవారని చెప్పారు. కానీ దేశాన్ని ఇప్పుడు ఇద్దరు పాలిస్తున్నారని, వారిలో ఎవరు అసలు నేతనో తెలియదన్నారు. నువ్వా, నేనా అన్నట్టు రూపాయి, సర్కారులు పోటీపడి పతనమవుతున్నాయన్నారు.

సరబ్‌జిత్ పాక్‌లో చనిపోయినదానికి ప్రధాని ఏం సమాధానం చెబుతారని, మన సైనికుల తలలను పాక్ సైనికులు నరికేసిన రెండు రోజుల తరువాత.. ఆ దేశ ప్రధాని రజా పర్వేజ్ అష్రాఫ్‌కు జైపూర్‌లో ప్రభుత్వం ఖరీదైన విందు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ విషాదం తనకు తీవ్ర విచారం కలిగించిందని, యాత్రికుల అనుభవాలను విన్నప్పుడు కదిలిపోయానని చెప్పారు.

English summary
Gujarat Chief Minister Narendra Modi on Sunday addressed his first public rally in Madhopur in Punjab on Dr. Shyama Prasad Mukherjee's Death aniversary after being elevated as the BJP’s election campaign committee chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X