వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరికీ నష్టం లేని పరిష్కారం: తెలంగాణపై విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
మెదక్/హైదరాబాద్: నాడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణవాదాన్ని గౌరవించారని, ఇప్పుడు తన తనయుడు, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా గౌరవిస్తున్నారని, ఎవరికీ నష్టం లేకుండా సమస్యను పరిష్కరించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ మంగళవారం అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆమె ఈ రోజు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఆమె తెలంగాణలోని పది జిల్లాల్లో ఈ రోజు నుండి పది రోజుల పాటు పర్యటిస్తారు. ఆమె మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగిన సభలో ప్రసంగించారు. ముందుగా ఆమె తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణవాదాన్ని నాడు వైయస్, నేడు జగన్ గౌరవిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏ రకమైన ఛార్జీలు పెంచలేదని, ఆయన చెప్పినట్లుగా ఉచిత విద్యుత్ ఇచ్చారన్నారు. నేటి ప్రభుత్వం మూడు గంటల విద్యుత్ కూడా ఇవ్వలేకపోతోందని ఆరోపించారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయన్నారు. వైయస్ మృతి తర్వాత రైతులు, రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు.

అవిశ్వాసం సమయంలో చంద్రబాబు కాంగ్రెసు ప్రభుత్వానికి అండగా నిలిచారని విమర్శించారు. చంద్రబాబుకు వ్యవస్థలను, మీడియాను మేనేజ్ చేయడం బాగా తెలుసునన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల చాలా నష్టం జరిగిందన్నారు. కిరణ్ సొసైటీ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. అందరం కలిసికట్టుగా కుమ్మక్కు రాజకీయాలు ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.

బెల్టు షాపును పరిచయం చేసింది బాబే: ప్రవీణ్ రెడ్డి

దేశానికి బెల్టు షాపులను పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి వేరుగా అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సిగ్గుపడేవిధంగా మద్యం పాలసీని తీసుకు వచ్చారన్నారు. డబ్బులు దండుకోవడానికే ఈ విధానమన్నారు.

సానుకూల నిర్ణయం: షబ్బీర్ అలీ

తెలంగాణపై త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఈ నెల 30వ తేదిన జరిగే సభను విజయవంతం చేస్తామన్నారు. తమకు సోనియా గాంధీ పైన నమ్మకముందన్నారు.

English summary
YSR Congress Party honorary president YS Vijayamma on Tuesday said that party chief YS Jaganmohan Reddy is respecting Telangana people desire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X