వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాపిరాజు గారి మహా సూక్తి: తిన్నదరక్కే కష్టాలట

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanumuri Bapiraju
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కనుమూరి బాపిరాజు జీవితానికి సంబంధించి సూక్తుల మూటను విప్పారు. ప్రజలు తిన్నదరక్కే కష్టాలు తెచ్చుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాదులోని పబ్లిక్‌గార్డెన్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎన్‌సీసీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేగేశ్న రాధాకృష్ణ రచించిన 'జాతక చంద్రిక' గ్రంథాన్ని బాపిరాజు ఆవిష్కరించారు.

చిన్నప్పటి నుంచి రాళ్లు, రప్ప కనిపిస్తే దేవుడిగా దం డం పెట్టుకునేవాడిని, ఒకసారి మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యతో కలిసి గుడివాడ నుంచి విజయవాడ వెళుతుంటే తులసి తోట కన్పించగానే దండం పెట్టుకున్నానని అన్నారు. అంజయ్య దేనికి దండం పెట్టుకుంటున్నావని అడిగారని, తులసీ తోటకు అనగానే, ఓరీ అజ్ఞాని, అవి సమాధులని చెప్పారని, దానికి తాను స్పందిస్తూ 'నాకు తులసీ తోటే కనిపించింది' అన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు.

తాను కృషినే నమ్ముకున్నాన ని, చైర్మన్ పదవి కోసం ఫైరవీలు చేయలేదని చెప్పారు. దైవసాక్షిగా ఆ తల్లి (సోనియమ్మ) వల్లే ఈ పదవి దక్కిందని చెప్పారు. ప్రకృతి, సైన్స్ గొప్పవని, శాస్త్రం తప్పుకాదని, దాన్ని అభివృ ద్ధి చేసి, సమాజానికి అందించాలన్నారు. హరికథలు, బుర్రకథలు తాను మాట్లాడనన్నారు. 'నేను రాజకీయ నాయకుణ్ని (కలుషితమయ్యా ను)' అంటూ గ్రంథకర్త వేగేశ్న రాధాకృష్ణకు తన చేతులు మీదుగా కాకుండా తన భార్య చేతుల మీదుగా విఘ్నేశ్వరుడి ప్రతిమను అందించారు.

కాగా, మానవ తప్పిదాల వల్లే కేదార్‌నాథ్ ఘట న జరిగిందని తెలుగు వర్సిటీ జ్యోతిష విభాగాధిపతి ఆచార్య సీవీబీ సుబ్రహ్మణ్యం అన్నారు. వేద విజ్ఞాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రంథకర్త ఎన్‌సీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వేగేశ్న రాధాకృష్ణ, వసుధా ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు, ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యుడు కమలాకర శర్మ తదితరులు పాల్గొన్నారు.

English summary
Tirumala Tirupathi Devasthanam (TTD) chairman Kanumuri Bapiraju said the reasons for troubles in human life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X