వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ అడ్డుకునే అవకాశం: కెకె, తేల్చాలని శైలజానాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: తాను పదమూడేళ్ల పాటు నిరీక్షించిన తర్వాతనే పార్టీని మారానని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి కె కేశవ రావు మంగళవారం అన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తనకుందన్నారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానిని అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నుండి వలసలను ఆపేందుకే కాంగ్రెసు పార్టీ తెలంగాణపై చర్చ అంటూ చెబుతోందని పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం అన్నారు. తెలంగాణ ప్రజలు ప్యాకేజీని కోరుకోవడం లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు.

తెలంగాణ ప్రజలు ప్యాకేజీని కోరుకోవడం లేదని తెరాస నేత వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాదు రాజధానితో, పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప తెలంగాణ ప్రజలు దేనిని అంగీకరించరన్నారు. ప్యాకేజీ ఇస్తే కాంగ్రెసు పార్టీ ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్యాకేజీల అవసరం సీమాంధ్ర నేతలకే ఉందని, తమకు లేదన్నారు.

సమైక్యమే కోరుకుంటున్నా: శైలజానాథ్

రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తాను కోరుకుంటున్నానని మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలుగువారు సమైక్యంగానే ఉండాలన్నారు. ప్యాకేజీలు, విభజన అన్నీ ఒట్టి ఊహాగానాలు మాత్రమేనన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని అధిష్టానం త్వరగా తేల్చితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary

 TRS general Secretary K Keshav Rao alleged that CM Kiran Kumar Reddy may stall Telagana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X