వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదలు: భజ్జీ 10 లక్షల విరాళం, తన వంతుగా ధావన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sekhar Dhawan - Harbhajan Singh
డెహ్రాడూన్: క్రికెటర్ హర్భజన్ సింగ్ ఉత్తరాఖండ్ వరదల బాధితులకు రూ.10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నారు. తాను ఉత్తరాఖండ్ బాధితులకు పది లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ వరదల బాధితుల కష్టాలు భజ్జీ స్వయంగా చూశారు. ఆయన కూడా వరదల్లో చిక్కుకుపోయారు. నాలుగు రోజుల క్రితం భారత సైన్యం అతనిని సురక్షితంగా అక్కడి నుండి తరలించింది.

బాధితుల కష్టాలు స్వయంగా చూసిన భజ్జీ వారికి తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తాను పది లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు తాను దీనిని అందజేస్తానని పిటిఐతో భజ్జీ చెప్పారు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్న శిఖర్ ధావన్ ఆ మొత్తాన్ని ఉత్తరాఖండ్ బాధితులకు ఇస్తానని ప్రకటించాడు.

కాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు నివేదికలు సమర్పించనున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకొని బయటపడిన పలువురు ఆంధ్ర ప్రదేశ్ భక్తులు ఇళ్లకు చేరుకున్నారు.

కేదార్‌నాథ్ ఆలయంలోని మృతదేహాల వెలికితీతకు వర్షం కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇవాళ నుంచి శవాలను వెలికితీసి వాటి అంత్యక్రియలను నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం భారీ స్థాయిలో మూడు క్వింటాళ్ల చందనం, 21 క్వింటాళ్ల దేవదారు కలప, 1500 లీటర్ల ఆవు నెయ్యి, ఒక క్వింటాలు కర్పూరం కేదార్ నాథ్‌కు తరలించారు.

English summary

 He was a witness to the plight of people affected by the devastating flash flood in Uttarakhand and it is no wonder that cricketer Harbhajan Singh has decided to help the victims in his own way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X