వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదలు: మరిన్ని రోజులు ఉత్తరాఖండ్‌లోనే చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ పార్లమెంటు సభ్యులతో కలిసి బుధవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి డెహ్రాడూన్ బయలుదేరారు. అదే విమానంలో ఢిల్లీలో వేచి ఉన్న తెలుగువారిని హైదరాబాదుకు తీసుకు వస్తారు. తెలుగు యాత్రికులను రాష్ట్రానికి చేర్చే వరకు చంద్రబాబు డెహ్రాడూన్‌లోనే ఉండి పర్యవేక్షించే అవకాశాలున్నాయి.

ఈ రోజు పలువురు తెలుగు వారికి వచ్చేందుకు టిక్కెట్లు దొరకలేదు. చంద్రబాబు మాట్లాడి వారికి టిక్కెట్లు దొరికేలా చేశారు. ఢిల్లీలో తెలుగువారి పర్యవేక్షణ బాధ్యతలను ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావుకు అప్పగించారు. రాష్ట్రానికి వచ్చాక ఆా జిల్లాల నేతలు బాధితులను ఇంటికి చేర్చుతున్నారు.

Nara Chandrababu Naidu

అంతకుముందు డెహ్రాడూన్‌లో తెలుగువారు ఆందోళనలో ఉన్నట్లు తెలియడంతో చంద్రబాబు అక్కడకు బయలుదేరారు. హెలికాఫ్టర్‌లో ఎక్కడానికి తెలుగు బాధితులకు టోకెన్లు ఇవ్వడం లేదని, వారు తిండితిప్పలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో అక్కడ పరిస్థితిని సమీక్షించిన అనంతరం చంద్రబాబు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ బహుగుణ దృష్టికి తీసుకు వెళ్లారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

కాగా, చార్ ధామ్ యాత్రకు వెళ్లిన తెలుగవారిపై ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి యాత్రకు వెళ్లి వారు 2,677 మంది అని, అందులో 1,308 మంది స్వస్థలాలకు చేరుకున్నారని, మిగిలిన యాత్రికులు సురక్షితంగా ఉన్నారని విపత్తు నిర్వహణ కమిషనర్ తెలిపారు. 371 మంది యాత్రికుల ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu has blamed the governments for not responding adequately and promptly to the plight of pilgrims of Char Dham who were caught in the floods in Uttarakhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X