వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బద్రీనాథ్ ఆలయ సాధువుల వద్ద రూ.కోటికి పైగా లభ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంలో బద్రీనాథ్ ఆలయానికి రక్షణ కల్పించిన సాధువుల వద్ద రూ.1.14 కోట్ల లభ్యమైనట్లుగా తెలుస్తోంది. కాగా బద్రీనాథ్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వాతావరణం అడ్డుగా నిలిస్తోంది. బద్రీనాథ్‌లో చాలామంది తెలుగు వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. వర్షాల కారణంగా బద్రీనాథ్‌లో సహాయక చర్యలు మందకోడిగా సాగుతున్నాయి.

కేదార్‌నాథ్‌లో సహాయక చర్యలు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇంకా 50 మంది అక్కడే ఉన్నట్లు చెబుతున్నారు. వారిని ఎందుకు తరలించలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రాణాలతో కేదార్‌నాథ్‌లో ఇప్పటికీ ఉన్నవారు సాధువులు, మూలే ఆపరేటర్లు మాత్రమే. వారు ఆలయ సంపదను, యాత్రికుల నుంచి కొల్లగొట్టిన ఆభరణాలను కొల్లగొట్టినట్లు సమాచారం.

Badrinath

మృతి చెందిన సైనికులకు సిఎం సహాయం

ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సైనికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ బహుగుణ సంతాపం తెలిపారు. మృతి చెందిన సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సైనికుల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. కాగా వరదల కారణంగా మృతుల సంఖ్య వేయి దాటుతుందన్నారు. బాధితులను రెండు రోజుల్లో తరలిస్తామన్నారు.

ఉత్తరాఖండ్ సందర్శకులపై నిషేధం లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ప్రారంభంలో ముమ్మర సహాయక చర్యల నేపథ్యంలో విఐపిలను రావద్దన్నామని, ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా వెళ్లవచ్చునని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో సామూహిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. మృతులు ఎంతమందో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. వరద బాధితులకు బిజెపి భారీ మొత్తంలో వస్తు, నగదు రూపంలో సహాయం చేస్తోంది.

తెలుగు వారి కోసం...

తెలుగువారిని ఆంధ్రప్రదేశ్ తరలించేందుకు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు డెహ్రాడూన్ నుండి హైదరాబాదుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. రుషికేష్ నుండి డెహ్రాడూన్‌కు ప్రత్యేకంగా బస్సులను వేశారు.

English summary
Uttarakhand Chief Minister Vijay Bahuguna on Wednesday announced that his government will compensate the families of those killed in the helicopter crash in Gaurikund on Tuesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X