వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహాయ చర్యల్లో యువజంటలు: రాష్ట్ర జవాన్ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వరదల్లో బాధితులకు సహాయ చర్యలు అందిస్తున్న వారిలో రెండు యువ జంటలు కూడా ఉన్నాయి. వైమానిక దళంలో ఈ జంటలు ఉన్నాయి. పురుష సైనికులు ఎంఐ 17 అనే పెద్ద హెలికాప్టర్లను నడుపుతుండగా, మహిళలిద్దరు చీతా అనే హెలికాప్టర్లకు పైలట్లుగా వ్యవహరిస్తున్నారు.

స్క్వాడ్రస్ లీడర్ ఎస్‌కె ప్రదాన్, ఖుష్బూ గుప్తాలకు నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. కొద్ది రోజులుగా వారు సహాయ చర్చల ప్రధాన కేంద్రం గౌచార్‌లో విధి నిర్వహణలో ఉన్నారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ తాన్యా శ్రీనివాస్, స్క్వాడ్రస్ లీడర్ విక్రమ్ త్యాగరామన్‌ల పెళ్లి ఏడాది క్రితం అయింది. ఈ రెండు జంటలు ఉత్తరాఖండ్ సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.

Uttarakhand floods: Young jawan couples service

రాష్ట్ర సైనికుడి మృతి

ఉత్తరాఖండ్‌లో మంగళవారం జరిగిన ఎంఐ17 హెలికాప్టర్ ప్రమాదంలో ఇరవై మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో మన రాష్ట్రానికి చెందిన జవాన్ కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన వినాయకం అనే సైనికుడు మృతి చెందినట్లుగా సమాచారం. ఇతని స్వస్థలం పూతలపడ్డ మండలం. గౌరి కుండ్‌లో కూరుకుపోయిన ఎంఐ 17 హెలికాప్టర్‌ను సైనికులు బుధవారం గుర్తించారు. మృతి చెందిన వారిని గుర్తించారు.

హరిద్వార్ వద్ద భారీ వరద

హరిద్వార్ వద్ద గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు చుట్టుపక్కల గ్రామస్తులను ఖాళీ చేయాలని ఆదేశించారు. అయితే గ్రామస్థులు మాత్రం నిరాకరించారు. దీంతో అధికారులు గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Two young jawan couples are servicing in Uttarakhand flood tragedy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X