వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళకరం: కృత్రిమ శ్వాసపై నెల్సన్ మండేలా

By Pratap
|
Google Oneindia TeluguNews

nelson mandela
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా నల్లజాతి సూర్యూడు నెల్సన్ మండేలా కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నారు. ఆయనకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. దీంతో ఆయన పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ కృత్రిమ శ్వాస పరికరాలను కూడా తొలగించే విషయంపై తుది నిర్ణయం తీసుకునే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకే వదిలి వేసినట్టు చెప్పారు. దీంతో ఆయన భౌతికంగా మరణించినట్టు తెలుస్తోంది.

అయితే, నెల్సన్ మండేలా ఆరోగ్యంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఎలాంటి అధికారిక వైద్య బులిటెన్‌ను జారీ చేయలేదు. దక్షిణాఫ్రికా జాతిపిత, గాంధేయవాది, ఆ దేశ మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా దాదాపుగా మరణించినట్లేనని వైద్య నిపుణులు అంటున్నారు. 95 ఏళ్ల వయస్సుకు చేరుకున్న మండేలా గత యేడాదిగా పలుమార్లు అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతూ వచ్చారు.

కానీ, ఈసారి మాత్రం ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ విషమించి ఆందోళకర స్థితికి చేరుకున్నారు. వారం దాటినా ఇప్పటికీ మండేలాలో చలనం కనిపించలేదు. దీంతో వెంటిలేటర్‌పైనే ఆయన జీవిస్తున్నారు.

మరోవైపు ఆస్ట్రేలియా మంత్రి గ్యారీ గ్రే నోరు జారారు. నెల్సన్ మండేలా ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయకుండానే జాతి వివక్ష వ్యతిరేక నేత మండేలా మరణించాడంటూ అన్నారు. దీనిపై పెద్దపెట్టున విమర్శలు రావడంతో ఆయన స్వయంగా దక్షిణాఫ్రికా దౌత్యాధికారిని కలిసి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.

English summary
Nelson Mandela's condition is "very critical" and "anything is imminent", his daughter Makaziwe Mandela said Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X