వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్ వెళ్లేందుకు కోనేరు ప్రసాద్‌కు అనుమతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Koneru Prasad
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్‌కు నాలుగు వారాల పాటు దుబాయి వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతినిచ్చింది. ఇందుకు గాను రూ.6 లక్షలు విలువ చేసే రెండు పూచీకత్తులను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్‌పై విచారణను సిబిఐ కోర్టు జులై 3వ తేదీకి వాయిదా వేసింది. మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు.

కాగా, భూకేటాయింపుల రద్దుపై కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్ హైకోర్టును ఆశ్రయించింది. బ్రాహ్మణి స్టీల్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు జులై 1వ తేదీకి వాయిదా వేసింది. బ్రాహ్మణి స్టీల్స్‌కు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకునే విషయంలో సోమవారం వరకు చర్యలు చేపట్టబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో బ్రాహ్మణి స్టీల్స్ స్థాపనకు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కర్మాగారం ఏర్పడితే 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు.

English summary
The CBI court has permited Koneru Prasad, accused in EMAAR properties scam case, to leave for Dubai for two weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X