వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదలపై ఎంపీల ఫైట్: జాతికి చంద్రబాబు క్షమాపణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandra Babu Naidu
హైదరాబాద్: ఉత్తరాఖండ్ వరద బాధితుల విషయమై తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల మధ్య జరిగిన ఘర్షణ పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం క్షమాపణ చెప్పారు. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ తప్పు ఏమీ లేదని చంద్రబాబు ఆ రోజే చెప్పారు. అయితే వరదల సమయంలో ఇలాంటి ఘర్షణలు సరికావని అన్న చంద్రబాబు, ఈ ఘటనపై తాను జాతియావత్తుకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు.

ఢిల్లీలో జరిగిన ఘటన తనను చాలా బాధించిందని అన్నారు. ఎపి భవన్ ఢిల్లీలో కట్టింది తెలుగు వారి కోసమే అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ బహుగుణను కలిసి బాధితుల సమస్యలను తాను వివరించానని అన్నారు. తాను మానవతా దృక్పథంతోనే సహాయం కోసం ముందుకు వచ్చానని చెప్పారు.

ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల సంఘం నిర్ణయించింది. తెలంగాణ ఉద్యోగ సంఘం కూడా రూ.40 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. రూ.20 కోట్లు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, రూ.20 కోట్లు ఉత్తరాఖండ్ బాధితులకు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. వారు ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.

రాష్ట్రానికి చెందిన పలువురు గల్లంతు

ఉత్తరాఖండ్ వరదలలో మన రాష్ట్రానికి చెందిన ఇంకా 115 మంది ఆచూకీ లభించలేదు. అందులో వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. అందులో హైదరాబాద్, రంగారెడ్డిల నుండే 70 మందికి పైగా ఉన్నారు.

చివరి వ్యక్తిని తరలించేదాకా సహాయ చర్యలు

ఉత్తరాఖండ్ వరద బాధిత యాత్రికులలో చివరి వ్యక్తిని తరలించే వరకు తమ సహాయ చర్యలు కొనసాగుతాయని ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై మంది సిబ్బందికి గౌరవ వందనం సమర్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన డెహ్రాడూన్ వచ్చారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu told his apology to nation for Delhi fighting incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X