వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు: వైయస్ విజయమ్మ వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ పార్టీ కార్యకర్తల సమావేశంలో శుక్రవారం అన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఆమె మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.

కార్యకర్తలు నేతలుగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడుతాయని ఆమె అన్నారు. ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేయాలన్నారు. అదే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి పైన, జగన్ సెంటిమెంట్ పైనే నమ్మకం పెట్టుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దన్నారు. అందరూ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేయాలన్నారు.

స్థానిక ఎన్నికలలో కార్యకర్తలు, నేతలు చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కార్యకర్తలను ఎలా చూసుకున్నారో జగన్ అలాగే చూసుకుంటారని అన్నారు.

ఎన్నికలలో బిసిలకు న్యాయం చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదన్నారు. సకాలంలో స్థానిక ఎన్నికలు జరగక పోవడం వల్ల గ్రామాలలో ఈ రోజు అన్నీ సమస్యలే ఉన్నాయని చెప్పారు. నాడు వైయస్ స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించారని చెప్పారు.

English summary

 YSR Congress Party honorary president YS Vijayamma on Friday suggested party cadre at Ghatkesar of Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X