వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజనకు రెడీ: వసంత, ఇదే అఖరి పోరు: పొన్నాల

By Pratap
|
Google Oneindia TeluguNews

ponnala laxmaiah and vasantha nageswar rao
విజయవాడ/ మెదక్/ హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడుతోందని, జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు తెలిపారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ప్యాకేజీ కోసం సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యే కృషి చేయాలని నాగేశ్వరరావు కోరారు.

తెలంగాణ సాధన కల త్వరలో నెరవేరబోతోందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం ఉదయం ఆయన మెదక్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం ఇదే ఆఖరి పోరాటమన్నారు. ఆదివారం జరిగే తెలంగాణ సభ ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు.

త్వరలో తెలంగాణ అనుకూల నిర్ణయం వస్తుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం జరిగే సభలో తెలంగాణపై తాము తీర్మానం చేస్తామని చెప్పారు. కాగా, రాష్ట్ర సమైక్యతకు ముప్పేమీ లేదని సీమాంధ్రకు చెందిన మంత్రి బాలరాజు అన్నారు. ఈ విషయంపై రాష్ట్రానికి వస్తున్న కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌కు విన్నవిస్తామని ఆయన శనివారంనాడు మీడియాతో చెప్పారు.

హైదరాబాదులోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో రేపు(ఆదివారం) జరిగే తెలంగాణ సాధన సభను విజయవంతం చేయాలని మంత్రి జానారెడ్డి కోరారు. సభకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. శనివారం ఉదయం నిజాం గ్రౌండ్స్‌లో జరుగుతున్న తెలంగాణ సాధన సభ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ పరిశీలించారు.

English summary
Jai Andhra leader and former minister Vasantha Nageswar Rao saif that Congress high command is preparing to bifurcate Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X