వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌ను చూసి చిరు బోల్తా: టిడిపి, కెటిఆర్‌పై ఎర్రబెల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Kavuri Sambasiva Rao
హైదరాబాద్/విజయనగరం: పేద ప్రజల కష్టాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవే కారణమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు శనివారం మండిపడ్డారు. జిల్లాలో ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనపై విసిగి ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోరుకుంటున్న సమయంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి, ఓట్లను చీలిక చేశారన్నారు.

పులినిచూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా స్వర్గీయ నందమూరి తారక రామారావులా తాను కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని కలలుగన్న చిరంజీవి ఎన్నికల్లో పార్టీ బోల్తాపడడంతో దుకాణం మూసేశారని ఎద్దేవా చేశారు. చిరంజీవి తనను నమ్ముకున్నవారిని నట్టేట ముంచి, తాను మాత్రం కేంద్ర మంత్రి అయ్యారని విమర్శించారు. వెండితెరపై గాని, రాజకీయాల్లో గాని రియల్ హీరో ఒక్క ఎన్టీఆరేనని పేర్కొన్నారు.

కావూరిని కలవడం మ్యాచ్ ఫిక్సింగే: ఎర్రబెల్లి

కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావును తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కలువడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. లగడపాటి రాజగోపాల్, కావూరిలు తెలంగాణ ద్రోహులని, తెరాసతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. కావూరి, కెటిఆర్ కలయికల మతలబు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిశారు. ఉత్తరాఖండ్ బాధితుల విషయంలో చంద్రబాబు చూపిన చొరవ పట్ల అక్కినేని ఆయనను అభినందించారని, చంద్రబాబు ఆయనకు ధన్యవాదాలు చెప్పారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

English summary

 Telugudesam Party senior leader Errabelli Dayakar Rao on Saturday alleged that TRS MLA KT Ramarao's meet with Kavuri Sambasiva Rao is a game being played by their parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X