వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్యేలకు వారెంట్, కెసిఆర్‌పై పిటిషన్ కొట్టివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

NBW to Telugudesam party mlas
హైదరాబాద్: రైల్ రోకో కేసులో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2011లో తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన రైల్ రోకో కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కేసులో వారికి రైల్వే కోర్టు వారంట్ జారీ చేసింది. ఇదే కేసులో ఇద్దరు తెరాస ఎమ్మెల్యేలు ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు.

విజయశాంతి, కెటిఆర్ ఆస్తులపై పిటిషన్ తిరస్కరణ

తెలంగాణ రాష్ట్ర సమితి సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఆస్తులపై దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం తిరస్కరించింది. దర్యాఫ్తు సంస్థలకే ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది.

బిసి రిజర్వేషన్ల విచారణ వాయిదా

పంచాయతీ ఎన్నికలలో బిసిల రిజర్వేషన్ అంశంపై దాఖలైన పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ విచారణ రెండు వారాలు వాయిదా వేసింది.

జగన్ కేసులో కోర్టుకు సబిత

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సోమవారం మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, కోనేరు ప్రసాద్, రాజగోపాల్, శ్యామ్యూల్, బిపి ఆచార్య తదితరులు కోర్టుకు హాజరయ్యారు. ధర్మాన, సబితల కస్టడీ మెమో పైన విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. జగన్, ఓఎంసి, ఎమ్మార్ కేసుల నిందితుల రిమాండును ఈ నెల 15వ తేది వరకు పొడిగించింది. మరోవైపు బ్రాహ్మణీ స్టీల్స్ భూముల స్వాధీనంపై యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

English summary
The Secunderabad Railway Court has on Monday issued Non Bailable Warrant to Eleven Telugudesam Party MLAs on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X