• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విభజించే హక్కు ఎక్కడిది?: శోభ, బాబు డిఎన్ఏపై పేర్ని

By Srinivas
|
sobha nagi reddy
హైదరాబాద్/కర్నూలు: రాయలసీమను విభజించే హక్కు ఎక్కడిదని, సీమను ముక్కలు చేస్తుంటే సీమ తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడటకపోవడం శోచనీయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శోభా నాగి రెడ్డి మంగళవారం అన్నారు. ఆమె కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ పేరుతో సీమ హక్కులను హరించేందుకు కాంగ్రెసు పార్టీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. సీమ అన్ని విధాలుగా వెనుకబడిందని, ఆంధ్రా రాష్ట్రం ఏర్పడినప్పుడే తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ సమస్యను తీసుకు వచ్చింది కాంగ్రెసు పార్టీయేనని, పరిష్కరించాల్సింది ఆ పార్టీయే అన్నారు. సీమను విడదీసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీమ ప్రాంతంలో తమ పార్టీ అన్ని సీట్లను గెలుచుకుంటుందనే ఉద్దేశ్యంతోనే రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చారని విమర్శించారు.

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని తామొక్కరమే ఆదుకున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని హైదరాబాదులో అన్నారు. అమెరికాకు వెళ్లిన బాబు ఆ విషయం మర్చిపోయేందుకే ఇదంతా చేశారన్నారు. టిడిపి కంటే తమ పార్టీయే వరద బాధితులను ఆదుకునేందుకు మొదట వెళ్లిందన్నారు.

టిడిపి అధికార పార్టీని నిలదీయాల్సింది పోయి తమ పార్టీ పైన నిందలు వేయడం సరికాదన్నారు. ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ పార్టీది కాంగ్రెసు పార్టీ డిఎన్ఏనే అన్న కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల పైన నాని స్పందించారు.

రాజకీయాల్లో ఎవరు ఎవరికీ డిఎన్ఏ కాదన్నారు. అలా అయితే చంద్రబాబు డిఎన్ఏ ఏమిటని, ఆయన ఏ పార్టీ నుండి వచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు భజన చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు 1999లో ఏ పార్టీ నుండి పోటీ చేసి గెలిచారో చెప్పాలన్నారు. జగన్‌ను చూస్తే కాంగ్రెసు, టిడిపిలు ఉలిక్కిపడుతున్నాయన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MLA Sobha Nagi Reddy has opposing Rayala Telangana proposal. She has questioned Rayalaseema Telugudesam Party leaders for their silence.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more