వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరద బీభత్సం: దేశం స్పందించింది!(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉత్తరాఖండ్ వరదల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, మరెందరో గల్లంతయ్యారు. వరద బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు, సంస్థలు స్పందిస్తున్నాయి. తీవ్ర విపత్తు నేపథ్యంలో దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. నగదు, వస్తు రూపంలో విరాళాలు పంపిస్తున్నారు. వివిధ సంస్థలు, విద్యార్థులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగులు తమ వంతుగా సహాయం చేస్తున్నారు.

పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చాయి.. వస్తున్నాయి. పది కోట్ల మంది ప్రజలు ఆన్ లైన్ ద్వారా రూ.3.5 కోట్లు పంపించారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లు రూ.18 కోట్లకు పైగా ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరఫున రూ.50 కోట్లు ప్రకటించారు. ఇందులో పది కోట్ల రూపాయలు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నేరుగా ఇస్తారు.

కేదార్ నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఒక్కో ప్రాంతంలో పది కోట్ల రూపాయల చొప్పున వెచ్చించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు వారి ఒకరోజు వేతనాన్ని ఇచ్చారు. అవి రెండు కోట్ల రూపాయలు. మంత్రులు ఒకరోజు వేతనాన్ని ఇచ్చారు. మధ్యప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రూ.6.67 కోట్లు ఇచ్చారు.

హాకీ ఇండియా రూ.10 లక్షలు, పంజాబ్ ప్రభుత్వం పది టన్నుల గోదుమలు, బియ్యం, వంద టన్నుల చక్కెర, పదివేల బ్లాంకెట్లు, శాలువాలు, స్వెట్టర్స్ ఇచ్చింది. బిజెపి గ్వాలియర్ వర్కర్స్ 250 బ్లడ్ బాటిల్స్ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం, మజ్లిస్ పార్టీ కూడా స్పందించింది. వరద బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా అందరు ముందుకు వస్తున్నారు.

స్థానికులకు వస్తువులు

ఉత్తరాఖండ్ వరద బాధితులకు వస్తువులు ఇస్తున్న దృశ్యం. కేదార్ వ్యాలీలోని వారికి పలువురు భారీ మొత్తంలో వస్తువులు అందించారు.

అన్నింట్లోను ఆర్మీ ముందే!

ఉత్తరాఖండ్ బాధితుల కోసం వచ్చిన వస్తువులను బాధితులకు చేరవేసేందుకు విమానం నుండి దించిన సైనికులు.

వస్తువుల్ని తీసుకెళ్తున్న లారీ

ఉత్తరాఖండ్ వరద బాధితులకు వస్తువులు తీసుకు వెళ్తున్న లారీ. జెండా ఊపుతున్న కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్.

ఆహారం ఇస్తున్న సైనికులు

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారాన్ని ఇస్తున్న సైనికులు

సైనికుల చేయూత

వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారాన్ని ఇస్తున్న ఓ సైనికుడు

షిండేకు చెక్కు

ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం సిఆర్‌పిఎఫ్ డిజి ప్రణయ్ సహాయ్ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేకు చెక్కు ఇస్తున్న దృశ్యం

ఫ్లడ్ రిలీఫ్ ఫండ్

బీహార్ రాజధాని పాట్నాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్‌ను సేకరించారు.

ఆశా భోంస్లే సహాయం

ఉత్తరాఖండ్ వరద బాధితులకు ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆమె ముఖ్యమంత్రికి చెక్ రూపంలో అందజేశారు.

జెండా ఊపిన సోనియా

ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం వెళ్తున్న లారీ లోడ్‌. జెండా ఊపి ప్రారంభిస్తున్న సోనియా గాంధీ. చిత్రంలో రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్.

కోల్ ఇండియా సహాయం

బాధితులకు తమ వంతు సహాయం చేసిన కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ మినిస్టర్‌కు చెక్‌ను అందచేస్తున్న డైరెక్టర్.

English summary
It is a terrible time for the whole nation. The Uttarakhand flood tragedy has left the country paralysed. Thousands died, thousands more are missing and their loved ones are still breathless and clinging onto a hope that some day, they will be found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X