వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ ట్రాజెడీ: దృశ్యాలు మటుమాయం (ఫోటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

డెహ్రడూన్: వర్షం తాకిడి, భారీ వరదలు ఉత్తరాఖండ్ భౌగోళిక స్థితిగతులనే పూర్తిగా మార్చేసినట్లు కనిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యం తర్వాత నాసా, భారత ఉహగ్రహాలు తీసిన చిత్రాలతో ఈ విషయం స్పష్టమవుతోంది. కేదార్‌నాథ్ ఆలయం వెనక ఉండే రెండు హిమానీనదాలు ఆగ్రహోదగ్ర రూపం దాల్చి వేలాది మంది బలి తీసుకుందని భావిస్తున్నారు. అంతకు మించి ఆ విపత్తు రాష్ట్రాన్ని పూర్వ స్థితికి తేలేని స్థితికి నెట్టేసిందని ఆ చిత్రాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

డైలీ మెయిల్ ప్రచురించిన కథనం ప్రకారం - రెండు హిమానీనదాలు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయని చిత్రాలు ద్వారా తెలిసిపోతోంది. కొండపైన గల వాసుకి తాల్ కూడా ఎప్పటిలాగే ప్రవహిస్తున్నట్లు చిత్రాల ద్వారా అర్థమవుతోంది. అయితే, ఆ ప్రాంతంలో భౌగోళిక స్థితిగతుల్లో ప్రకృతి వైపరీత్యం భారీ మార్పును తెచ్చిందని అర్థమవుతోంది. చాలా సెటిల్‌మెంట్లు రూపురేఖలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. కేదార్‌నాథ్ ఆలయం వెనక కొత్త ప్రవాహం ఒక్కటి పుట్టుకొచ్చింది.

రాంబారా అదృశ్యం

శాటిలైట్ చిత్రం - గౌరికుండ్ - కేదార్‌నాథ్ ట్రెక్‌పై యాత్రికులకు విశ్రాంతి కోసం వాడే రాంబారాలోని సెటిల్మెంట్.. ముందు (ఎడమపక్కన), తర్వాత (కుడిపక్కన)

కేదార్‌నాథ్ - జీవం లేదు

ప్రకృతి వైపరీత్యానికి ముందటి శాటిలైట్ చిత్రం కేదార్‌నాథ్ చుట్టు గల సెటిల్మెంట్లను చూపిస్తోంది (ఎడమ పక్కన), అది పూర్తిగా అదృశ్యమైనట్లు ప్రకృతి వైపరీత్యం తర్వాతి చిత్రం (కుడిపక్కన) చూపిస్తోంది.

మందాకినీ లోయ

ప్రకృతి వైపరీత్యానికి ముందు తీసిన తీసిన చిత్రం మాందాకిని లోయను చూపిస్తోంది (ఎడమ పక్కన), ప్రకృతి వైపరీత్యం సంభవించిన తర్వాత ఇలా (కుడిపక్కన)

ఉత్తరాఖండ్ రిలీప్ ప్యాకేజీ

వరద బాధితుల కోసం సరుకులను తీసుకుని వెళ్తున్న లారీలకు శివుడి వేషంలో ఉన్న వ్యక్తి పచ్చ జెండా ఊపుతున్న వ్యక్తి

సహాయక చర్యలు

ఉత్తరాఖండ్‌లో బాధితురాలిని రక్షిస్తున్న సైనికాధికారులు

కేదార్‌నాథ్ వ్యాలీ

కేదార్‌నాథ్ ఆలయం లోపల, బయట దృశ్యాలను చూపుతున్న చిత్రాలు (సోర్స్ - అత్తరాఖండ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, డెహ్రడూన్)

రాంబారా

సర్వం కోల్పోయిన రాంబారా (సోర్స్ - ఉత్తరాఖండ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఉత్తరాఖండ్)

రాంబారా నుంచి కేదార్‌నాథ్ వరకు..

కేదార్‌నాథ్ నుంచి రాంబారా, గౌరికుండ్ వరకు ప్రవహించిన చెత్త అంతా ప్రతిదాన్నీ కప్పేస్తూ వెళ్లిందని వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి (సోర్స్ - ఉత్తరాఖండ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, డెహ్రడూన్)

కేదార్ నాథ్ లోయ

ప్రకృతి వైపరీత్యానికి ముందు, తర్వాత కేదార్‌నాథ్ వ్యాలీ (సోర్స్ - ఉత్తరాఖండ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, డెహ్రడూన్)

ఇంతకు ముందు రెండు ప్రవాహాలు ఉండేవి. కొత్త ప్రవాహం మరింత వెడల్పుగా మారింది. ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించిన నష్టాన్ని తెలుసుకోవడానికి ఉత్తరాఖండ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ పాత చిత్రాలతో కొత్తవాటిని పోల్చి చూసింది.

ఉత్తరాఖండ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ పరిశీలన ప్రకారం గౌరికుండ్, కేదార్‌నాథ్ మధ్య గల 14 కిలోమీటర్ల రోడ్డులో 80 శాతం పూర్తిగా నాశనమైంది. గౌరికుండ్‌కు 7 కిలోమీటర్ల దూరంలో గల రాంబారా చిత్రం నుంచి పూర్తిగా అదృశ్యమైంది. కేదార్‌నాథ్ నుంచి రాంబారా, గౌరికుండ్ వరకు సాగిన ప్రవాహం ప్రతిదాన్నీ సమాధి చేస్తూ వెళ్లింది.

English summary
Post-disaster images taken from NASA and Indian satellites have crushed popular perception that bursting of two glaciers behind the Kedarnath temple caused the massive fury in the Himalayan state of Uttarakhand last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X