చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోరం‌‌‌: చెన్నై మాల్‌పై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

death
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోయపెట్టాలోని ఎక్స్‌ప్రెస్ ఎవన్యూ మాల్ మూడో అంతస్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిసిటివీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని డి. షణ్ముగంగా గుర్తించారు. చివరి సారి 3.42 గంటలకు ఎస్కలేటర్ వద్ద నిలబడి ఉన్నట్లు సిసిటివి పుటేజ్ ద్వారా తెలిసింది.

కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థలో అనతు ప్రోగ్రామ్ అనలిస్టుగా పనిచేస్తున్నాడు. ఎస్కలేటర్ వద్ద నిలబడ్డ కొద్దిసేపటికే అతను కిందపడుతూ కనిపించాడు. కిందపడిన షణ్ముగం తలపై గాయాలయ్యాయి, రక్తస్రావం జరిగింది. దీంతో అతను మరణించాడు.

ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది నిమిషాల ముందే అతను కొద్ది మంది మిత్రులకు మెసేజ్ పంపించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ మెసేజ్‌లో స్పష్టంగా చెప్పాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అనతు తన సెల్‌ఫోన్‌లోని దాదాపు 9 వేల మెసేజ్‌లను, 198 ఫోన్ నెంబర్లను తొలగించాడు. తన తండ్రి ఫోన్ నెంబర్‌ను, జివిగా చెప్పిన మిత్రుడి ఫోన్ నెంబర్ మాత్రం తొలగించలేదు.

కోయంబత్తూరులో ఏడాదిన్నరగా పనిచేస్తున్న షణ్ముగం ట్రైనింగ్ సెషన్ కోసం సోమవారం చెన్నై వచ్చాడు. ఎవరినో కలవడానికి అతను చెన్నై మాల్‌కు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను షాపింగ్ చేశాడు. అతని సంచీలో రెండు చాక్లెట్లు కూడా ఉన్నాయి.

కిందికి దూకడానికి ముందు అతనితో వద్ద ఎవరూ లేరు. జారిపడిపోయి ఉండవచ్చుననే వాదనను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. షణ్ముగం ఓ సంబంధం పెట్టుకున్నాడని, ఆ విషయంపై ఎప్పుడూ చర్చించలేదని అతని మిత్రుడొకతను అంటున్నాడు. షణ్ముగం తండ్రి దైవనాయగం ట్యూటికోరిన్‌లోని విండ్ ఫామ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

English summary
A 23-year-old software engineer plunged to his death from the third floor of Express Avenue mall in Royapettah on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X