హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిలాడీ లేడీతో కలిసి 'గోల్డ్' చీటింగ్: టిఆర్ఎస్ నేత అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

TRS leader arrested
హైదరాబాద్: బంగారం చీటింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి అంబర్‌పేట నియోజకవర్గం ఇంఛార్జ్ చిట్టాడి నర్సింహా రెడ్డి సహా నలుగురు అరెస్టయ్యారు. బంగారం, ఇనుము తక్కువ ధరకు ఇస్తామంటూ వీరి పలువురిని మోసగించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో సిసిఎస్ పోలీసులు బుధవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

కిలాడీ లేడి అరుణతో కలిసి నర్సింహా రెడ్డి ఈ మోసానికి పాల్పడ్డారు. అరెస్టైన వారిలో నర్సింహా రెడ్డి, అరుణ, ముంతాజ్ అహ్మద్, బాబూచారిలు ఉన్నారు. వీరు ఇరవై కోట్ల నుండి ముప్పై కోట్ల రూపాయల మేరకు మోసం చేసి ఉంటారని సిసిఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు.

బస్సు బోల్తా

చిత్తూరు జిల్లాలోని నిమ్మలపల్లిలో బుధవారం ఉదయం ఓ స్కూల్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం

కూకట్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థి రాము మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన రాము మల్లారెడ్డి కాలేజీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు.

English summary
Amberpet Telangana Rastra Samithi leader Narasimha Reddy was arrested by Hyderabad CCS police on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X