హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెహ్రూ వద్దన్నా, పటేల్ సైనికచర్య: హైద్రాబాద్‌పై అద్వానీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

 K Advani praises Sardar Patel for integrating Hyderabad with India
న్యూఢిల్లీ: హైదరాబాద్ విలీనం కోసం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా చొరవ చూపారని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. దేశ తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ కృషి వల్లనే భారత‌లో హైదరాబాద్ విలీనం సాఫీగా జరిగిందన్నారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించినా సర్దార్ సైనిక బలాన్ని ప్రయోగించారని తన బ్లాగ్‌లో వ్యాఖ్యానించారు. విపి మీనన్, ఎమ్.కె.కె.నాయర్ పుస్తకాలను ప్రస్తావిస్తూ, హైదరాబాద్ విలీనంనాటి పరిస్థితులను వివరించారు.

దేశంలోని 564 సంస్థానాలను పటేల్ భారత్‌లో విలీనం చేసిన సమయంలో మీనన్ ఆయన దగ్గర పని చేశారు. నెహ్రూ అభ్యంతరాలను సైతం పట్టించుకోకుండా సైన్యాన్ని పటేల్ హైదరాబాద్‌కు పంపారని మీనన్ రచనను ఉటంకిస్తూ అన్నారు. యూనియన్‌లో కలవడానికి నిజాం నిరాకరించారని, జమ్మూకాశ్మీర్ విషయంలో తాను అనుసరించిన ఐక్య రాజ్య సమితి బాటను హైదరాబాద్ అంశంలోనూ పాటించాలని నెహ్రూ కోరుకున్నారని, అయితే, నిజాంను లొంగదీసేందుకు సైన్యాన్ని పంపాలని పటేల్ నిర్ణయించారని నాయర్ రచన "ఎవరికీ మూడో భావన లేదు''లోని అంశాలను ఉటంకించారు.

జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్లాలన్న నెహ్రూ నిర్ణయం ఘోర తప్పిదమని బిజెపి తరచూ విమర్శిస్తూంటుంది. దేశ సరిహద్దుల్లోని ఒక రాజ్యానికి 370 అధికరణం కింద ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడాన్నీ వ్యతిరేకిస్తోంది. దీన్ని రద్దు చేయాలన్న అద్వానీ వ్యాఖ్యలతో ఆయనకు, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

హైదరాబాద్‌పై మధ్యవర్తిత్వం వహించాలని నిజాం.. అమెరికా అధ్యక్షుడికి లేఖ రాయగా, ఆ దేశం నిరాకరించిందని అద్వానీ పేర్కొన్నారు. ఆ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి.. మన ప్రభుత్వానికి తెలిపారన్నారు. హైదరాబాద్ విలీనం సమయంలో పాక్ జోక్యంగానీ, ముస్లింలు మతకల్లోలాలకు పాల్పడటం లేదా వారిపై మత దాడులు జరగడం చోటుచేసుకోలేదన్న అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.

హైదరాబాద్‌పై ఎలాంటి వైఖరి తీసుకోవాల నేదానిపై భారత ప్రభుత్వంలోని సలహాదారుల మధ్య ఏకాభిప్రాయం లేదని, సామరస్యంగా పోవాలని తలచని ఒక వర్గం.. మత కల్లోలాల అంశాన్ని తెరపైకి తెచ్చిందని, హైదరాబాద్‌లోని వేలాది హిందువులు ఊచకోతకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేసిందని, ఆ వెంటనే దేశవ్యాప్తంగా ముస్లింల పైనా మారణకాండ సాగుతుందని అంచనా వేసిందన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఒక్క చిన్న మతపరమైన ఘర్షణ సంఘటన కూడా చోటు చేసుకోకుండానే పోలీస్ చర్య పూర్తయిందన్నారు.

English summary
After seeking abrogation of special status for Jammu and Kashmir, BJP leader L K Advani on Tuesday praised India's first Home Minister Sardar Vallabhbhai Patel for integrating Hyderabad into the Indian Union through the use of force despite Jawaharlal Nehru's opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X