వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అరెస్ట్: పనబాకపై బాంబు పేల్చిన మోపిదేవి బ్రదర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan and Panabaka Laxmi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే తన సోదరుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను జైలు నుండి బయటకు తీసుకు వస్తామని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చెప్పారని, అయినా తాము ఒప్పుకోలేదని మోపిదేవి సోదరుడు హరనాథ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సమయంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు అరెస్టైన సమయంలో పనబాకను కలిస్తే జగన్‌కు వ్యతిరేకంగా కోవర్టుగా మారితే బయటకు తీసుకు వస్తామని ఆమె చెప్పారని ఆరోపించారు. జైలులో ఆయన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదన్నారు. వైద్య సాయం కోసం మంత్రి కొండ్రు మురళిని కలిసి బతిమాలినా వినిపించుకోలేదని ఆయన ఆరోపించారు.

వైయస్ అధికారంలోకి తెస్తే ఎఫ్ఐఆర్‌లో పెట్టారు: విజయమ్మ

26 జివోల కేసు రాజకీయ ప్రేరేపిత కుట్ర అని వైయస్ విజయమ్మ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కష్టపడి కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే, జగన్ కేసులో ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 26 జివోల విషయంలో ఒక్కొక్కరి పట్ల ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారన్నారు.

వైయస్ పైన, జగన్ పైన అభిమానంతో పార్టీలో చేరుతున్న వారికి కృతజ్ఞతలు చెప్పారు. జగన్‌ని అరెస్టు చేసేందుకు మోపిదేవిని బలి చేశారన్నారు. మోపిదేవిని అరెస్టు చేసే సయంలో వారం రోజుల్లో బయటకు తీసుకు వస్తామని చెప్పి తీసుకు రాలేదని ఆరోపించారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయ్యాయని, వారి పాపం పండే రోజు వస్తుందన్నారు.

English summary
Former Minister and Congress MLA Mopidevi Venkataramana brother Haranath Babu and son Rajeev were joined in YSR Congress on Friday in the presence of YS Vijayamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X