• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణకు రాజకీయ సమస్యలు: ఎంపి అనంత వ్యాఖ్య

By Srinivas
|

Ananta Venkatarami Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారానికి రాజకీయ సమస్యలు ఉన్నాయని అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి శుక్రవారం ఢిల్లీలో అన్నారు. అనంత, మంత్రి రఘవీరా రెడ్డి తదతరులు కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. అనంతరం అనంతర మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాము దిగ్విజయ్‌ను కోరినట్లు చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదన లేదన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి రాజకీయ సమస్యలు ఉన్నాయన్నారు. వాటి పరిష్కారంపై అధిష్టానం సమాలోచనలు చేస్తోందన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణపై రాజకీయ అనిశ్చితి తొలగించాలనే ఉద్దేశ్యంతో పార్టీ అధిష్టానం ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను తాము ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. త్వరలో అనంతపురం జిల్లాలో, కోస్తాలోని ఓ జిల్లాలో సమైక్య సభను పెడతామన్నారు.

జెఏసి నేతలకు విహెచ్ విందు

తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతలకు రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఈ రోజు విందు ఇచ్చారు. ఈ విందులో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెసు పార్టీ తెలంగాణలో 15 సీట్లను గెలుచుకుంటుందన్నారు. కేంద్రంలో యూపిఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు.

English summary
Anantapuram MP Ananta Venkatarami Reddy has said on Friday that state will not divide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X