వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్ 9 ప్రకటన ముగిసిన అధ్యాయం: శైలజానాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
అనంతపురం/న్యూఢిల్లీ: 2009 డిసెంబర్ 9న తెలంగాణపై చేసిన ప్రకటన ముగిసిన అధ్యాయమని, ఆ తర్వాత డిసెంబర్ 23న చేసిన ప్రకటనే అసలైన కేంద్రం ప్రకటన అని మంత్రి శైలజానాథ్ సోమవారం అనంతపురంలో అన్నారు. సోమవారం సమైక్యాంధ్ర మేధావుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి శైలజానాథ్ హాజరయ్యారు.

గతంలో డిసెంబర్ 23వ తేదిన రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. అది ఇప్పటికే కొనసాగుతుందని, విభజన ఎట్టి పరిస్థితుల్లోను జరగదన్నారు. అనంతపురం నుండి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకు కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్న మంత్రులు సమైక్యవాదాన్నే వినిపిస్తున్నారనే సమాచారం తమ దగ్గర ఉందన్నారు.

తొమ్మిదో తేది నుండి సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి తలపెట్టిన కార్యాచరణ కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం జెఏసిలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా సహకారం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణల రోడ్ మ్యాప్ సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉండేలా ఒప్పిస్తామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండే సీమలో 32 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటామన్నారు.

నివేదిక ఇచ్చాం: ఓయు జెఏసి

కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్‌కు తెలంగాణపై నివేదిక ఇచ్చామని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి సోమవారం ఢిల్లీలో తెలిపింది. డిగ్గీని కలిసిన అనంతరం జెఏసి నేత పిడమర్తి రవి మాట్లాడారు. ఈ నెల 12లోపు తెలంగాణపై ప్రకటన రాకుంటే పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసుకు ఓటమి తప్పదన్నారు.

English summary
Minister Sailajanath said on Monday that December 9th announcement on Telangana is ended chapter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X