వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ మా రాజధాని, విభజిస్తే...: రాయపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజించకూడదని తమ పార్టీ అధిష్టానాన్ని కోరామని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. ఒక వేళ విభజించాల్సి వస్తే ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాద్‌ను తమ రాజధాని అని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

మంత్రుల్లో అవినీతి పరులు ఎవరో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాయపాటి సాంబశివ రావు ఇది వరకు చెప్పిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సిగ్‌తో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. అలాగే రాయలసీమను విభజించవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను సోమవారం కలుసుకుని తెలంగాణపై నివేదిక ఇచ్చామని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి జెఎసి నేత పిడమర్తి రవి అన్నారు. ఈనెల 12వ తేదీ లోపు ప్రత్యేక తెలంగాణపై ప్రకటన రావాలని, లేకుంటే పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ప్రకటన చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడతామని రవి చెప్పారు.

English summary
The Congress Guntur MP said that they are feeling Hyderabad is their capital. He said that they appealed to the Congress high command not to bifurcate Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X