వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావూరికి సమైక్య సెగ, మేమే ఫస్ట్: జగన్ పార్టీపై ఏరాసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao - Erasu Pratap Reddy
హైదరాబాద్/విశాఖ/గుంటూరు: కేంద్ర జౌళీ శాఖ మంత్రి, ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుకు ఆదివారం సమైక్య సెగ తగిలింది. ఆయన గుంటూరు జిల్లాలో పర్యటించారు. గుంటూరులో రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్ వద్ద కావూరి దగ్గరకు దూసుకు వచ్చేందుకు సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధిలు ప్రయత్నించారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయనతో సంతకం చేయించాలని ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకొని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల అరెస్టును నిరసిస్తూ విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి సోమవారం సీమాంధ్రలో విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చింది.

విభజిస్తే రాజీనామా: ఏరాసు

రాష్ట్రాన్ని విడదీస్తే ముందుగా తామే పదవులకు రాజీనామా చేస్తామని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అన్నారు. కడప జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేస్తున్నట్లు హడావుడి చేస్తూ నాటకాలాడుతున్నారని, విభజిస్తే తామే ముందు రాజీనామా చేస్తామన్నారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

విభజిస్తే..: గాదె

రాష్ట్రాన్ని ఓట్లు, సీట్ల కోసం విభజిస్తే, అది కాంగ్రెసు పార్టీ చేసే పెద్ద తప్పవుతుందని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. విభజన జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు పార్టీ ఎప్పుడు హామీ ఇవ్వలేదన్నారు.

English summary

 Samaikyandhra student JAC obstructed central minister Kavuri Sambasiva Rao on Sunday in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X