హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిల్డింగ్ పైనుండి దూకి మహిళా టెక్కీ ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Techie commits suicide
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని మాదాపూర్‌లో ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్నారు. మాదాపూర్‌లోని ఒరాకిల్ సాఫ్టువేర్ కంపెనీలో అశ్వినీ నాయర్ అనే యువతి ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం ఉదయం అశ్విని గచ్చిబౌలిలోని తమ కంపెనీ కార్యాలయం పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు బెంగళూరుకు చెందిన వారు. ఆమె ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, ఒత్తిడి తట్టుకోలేకపోతున్నట్లు తండ్రికి చెప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో ఇన్ఫోసిస్ భవనం పై నుండి నీలిమ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాల పేరుతో మోసం

హైదరాబాదులోని హిమయత్ నగర్‌లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన నిర్వాహకులు ఒక్కో యువతి నుండి దాదాపు రెండు లక్షల రూపాయలు వసూలు చేశారు. ఎంతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు సంస్థ కార్యాలయంపై దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

యాసిడ్ దాడులు: కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: యాసిడ్ దాడులను అరికట్టడంలో కేంద్రం వైఫల్యంపై సుప్రీం కోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాసిడ్ దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని, యాసిడ్ విక్రయాలపై నిబంధలను కఠినతరం చేసే అంశంపై కేంద్రం ఆలోచించాలని సూచించింది. కేంద్రం స్పందించకుంటే ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.

జి.కొండుకు ఘటనపై విచారణ ప్రారంభం

కృష్ణా జిల్లా జి.కొండూరులో పోలీసు అధికారుల వీరంగంపై అధికారులు విచారణ ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై అబ్దుల్ హక్, సిఐ బంగార్రాజులను ఏఎస్పీ విచారించారు.

English summary
A women Software employee working with an IT company in Hyderabad today committed suicide by jumping off the office building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X